బిగ్ బాస్ హోస్ట్ తో హీరోయిన్ ఫామ్ హౌస్ లో రొమాన్స్ ఆ ఇదెక్కడి దరిద్రం రాబాబు అనుకుంటున్నారా.. ఈ వార్తలో నిసమెంతో తెలియదు కానీ కొద్ది రోజులుగా నెటింట ఈ న్యూస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంత.. ఇంతకీ ఆ బిగ్ బాస్ హోస్ట్ ఎవరు.. హీరోయిన్ ఎవరు.. అనే వివరాలు ఇప్పుడు ట్రెండింగ్‌గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్ బాస్ హోస్ట్ మరెవరో కాదు హిందీ బిగ్‌బి హోస్ట్ గా వ్యవహరిస్తున్న.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. హిందీలో బిగ్ బాస్ షో కి హోస్టుగా ఎన్నో సీజన్ల నుంచి చక్రం తిప్పుతున్నారు.
అయితే తాజాగా సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో ఓ హీరోయిన్ తో ఎంజాయ్ చేశారంటూ.. ప్రముఖ సినీ క్రిటిక్ అంటూ చెప్పుకునే ఉమైర్ సంధు షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా సల్మాన్ ఖాన్.. హీరోయిన్ మన్నారా చోప్రా ఇద్దరినీ టార్గెట్ చేస్తూ ఉమైర్ చేసిన పోస్ట్ నెటింట వైరల్‌గా మారింది. బిగ్ బాస్‌లోకి వెళ్లిన హీరోయిన్ మనరా చోప్రా.. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు సల్మాన్ ఖాన్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేసిందని.. ఉమైర్ చేసిన కమెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి. బిగ్ బాస్ సీజన్ 17 లో హీరోయిన్ మన్నార్ చోప్రా.. కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈమె ఫైనల్‌కు కూడా చేరుకుంది. ఇక మన్నారా చోప్రా కేవలం బాలీవుడ్ లోనే కాదు.. తెలుగులో కూడా తిరగబడరా స్వామి, సీతా, రోగ్, జక్కన్న, తిక్క లాంటి ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అలాంటి అమ్మడు సల్మాన్ ఖాన్ తో లింక్ చేస్తూ ఉమర్ సందు పెట్టిన పోస్ట్ దుమారంగా మారింది. సల్మాన్ అభిమానులు ఉమైర్ సంధుపై ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో హైలెట్ అవడం కోసం నీకు నచ్చినట్టు చెత్త ఆరోపణలు చేస్తే అసలు సహించేది లేదు అంటూ.. మీ అంతు తెలుస్తాం అంటూ మండిపడుతున్నారు.