టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాలలో దేవర ఒకటి. ఈ సినిమాను కొరటాల శివ ఎలాగైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని కసితో రూపొందించారు. ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కనున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ ప్రేక్షకులను 50% ఆకట్టుకుంటే.. మిగిలిన వాళ్ళు మాత్రం ట్రైలర్‌ను ట్రోల్ చేస్తూ నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే రూ.350 కోట్ల బిజినెస్ జరిగిందని.. ఇప్పటికే నిర్మాతలు సేఫ్ అయిపోయారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దేవర ట్రైలర్ చూసిన ఆడియన్స్ కథ, కథనం విషయంలో పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే సినిమాలో సైఫ్, తారక్ మధ్యన జరిగే యాక్షన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని.. ఇక సినిమా క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్ట్‌లు ఎవరు ఊహించని విధంగా ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా ట్రైలర్ చూసి డిసప్పాయింట్ అయిన అభిమానులకు కూడా.. సినిమా పూర్తి అయిన తర్వాత ఒక బ్లాక్ బాస్టర్ తారక్ ఖాతాలో పడిందని సంతృప్తితో బయటకి వస్తారని.. ముఖ్యంగా ఎన్టీఆర్ చెప్పినట్లు ఆఖరి 40 నిమిషాలు యాక్షన్ సీన్స్ సినిమాకి వేరే లెవెల్లో హైలెట్ కానున్నాయని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ట్విస్ట్ ఇదేనంటూ ఓ వార్త నెటింట వైరల్ గా మారుతుంది.
తండ్రి దేవర పేరుతో భయస్తుడుగా నటిస్తూ కొడుకే విలన్లను ఊచకోతకు కోస్తాడంటూ క్లైమాక్స్ లో.. ఈ ట్విస్ట్ రివీల్ చేసినప్పుడు ప్రేక్షకులను షాక్‌కి గురిచేస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే కొడుకు దేవర..గా నటిస్తే మరి దేవర ఏమైనాట్టు.. అసలు ఉన్నాడా.. లేడా.. అనే సందేహాలు ఇప్పుడు అభిమానులలో మొదలయ్యాయి. ఇందులో తారక్ డ్యూయల్ రోల్‌లో నటించడం లేదా అంటూ.. కొందరు సోషల్ మీడియా వేదికగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రైలర్, పోస్టర్ల ద్వారా మేకర్స్ కావాలని ఈ సస్పెన్స్ ను ఆడియన్స్ లో క్రియేట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. దీనిపై అఫీషియల్ న్యూస్ రాకపోయినా ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ టాక్ నడుస్తుంది. తారక్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఇలాంటి బ్లాస్టింగ్ ట్విస్టులు ఉంటే.. సినిమా రికార్డ్ బ్రేక్ చేయడం మాత్రం ఖాయం. ఇక తండ్రి పేరుతో కొడుకే విధ్వంసం సృష్టిస్తాడా.. లేదా.. ఇద్దరు ఊచకోత అదరగొడతారా.. చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.