ఇప్పటివరకు సౌత్ సినీ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాస్ వసూళ్లను కల్లగొట్టిన టాప్ 10 సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో అధిక కలెక్షన్లను కొల్లగొట్టిన సౌత్ సినిమాల లిస్టు వైరల్ గా మారుతుంది. అందులో మన టాలీవుడ్ సినిమాలదే పై చేయి కావడం విశేషం. ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం రండి.
బాహుబలి 2:
ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1810 కోట్ల గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టి అధిక కలెక్షన్లను కొల్లగొట్టిన మొట్టమొదటి సౌత్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆర్ఆర్ఆర్:
రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఏకంగా రూ.1290 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి రెండో స్థానంలో నిలిచింది.
కేజిఎఫ్ చాప్టర్ 2:
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.1233 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొలగొట్టి మూడో స్థానాన్ని దక్కించుకుంది.
కల్కి2898 ఏడి:
ప్రభాస్ హీరోగా అశ్విని దత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన కల్కి సినిమా రూ.1061.50 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానం దక్కించుకుంది.
రోబో 2.0:
రజనీకాంత్ హీరోగా, శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన రోబో రూ.709 కోట్ల క్లాస్ వసూలను కొలగొట్టి 5వ స్థానాన్ని దక్కించుకుంది.
సలార్:
ప్రభాస్ హీరోగా , ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన సలార్ రూ.630.15 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి ఆరోవ స్థానంలో నిలిచింది.
జైలర్:
రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మూవీ జైలర్. రూ.606.30 కోట్ల గ్రాస్ వసూళ్లను కల్లగొట్టి ఏడోవ స్థానాన్ని దక్కించుకుంది.
బాహుబలి:
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ బాహుబలి.. ఏకంగా రూ.605 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి ఎనిమిదవ స్థానంలో నిలిచింది.
లియో:
విజయ్ దళపతి హీరోగా, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన లియో రూ.600.60 కోట్ల కలెక్షన్లతో 9వ స్థానాన్ని దక్కించుకుంది.
పొన్నియన్ సెల్వన్:
మణిరత్నం డైరెక్షన్‌లో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రూ.487.50 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి 10వ స్థానాన్ని దక్కించుకుంది. అలా ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్లు కల్లగొట్టిన టాప్ 10 సినిమాలలో తెలుగు సినిమాలదే పై చేయి కావడం విశేషం.