మ్యాన్ అఫ్ మాసెస్ తారక్ హీరోగా తెరకెక్కనున్న మూవీ దేవర. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కే సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా, బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రానుంది. సెప్టెంబర్ 27న సినిమా ఫస్ట్ పార్ట్ గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. అయితే సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయి సోషల్ మీడియాలో మంచి అంచనాలను నెలకొల్పింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నుంచి ఆరేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది.
ఇలాంటి క్రమంలో సినిమా బిజినెస్ విషయంలో కన్ఫ్యూషన్ నెలకొందని.. తారక్ మార్కెట్ ఎంత అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఎర్పడిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. చివరిగా ఎన్టీఆర్ సోలో హీరోగా తెరకెక్కిన అరవింద సమేత బిజినెస్‌కు తగ్గ షేర్లు రాబటలేకపోయిందని టాక్. ఇక ఆర్‌ఆర్ఆర్ తో పాన్ ఇండియన్ హీరోగా తారక్ ఇమేజ్ వచ్చినా. సక్సెస్ క్రెడిట్ అంతా జక్కన్నకే దక్కింది. ఈ క్రమంలో దేవరతో సోలో హీరోగా ఎన్టీఆర్ మార్కెట్ ఎంత అనేది తేలిపోనుంది. అయితే దేవర విషయంలో ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ చూపించినా.. సినిమా రిలీజ్‌కు ముందు హైప్ పెంచడం కోసమే ఇదంతా చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
మొదటినుంచి దేవర పార్ట్1 కు హైప్ క్రియేట్ చేస్తే.. భారీ బిజినెస్ జరుగుతుందని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు హక్కులనుకునేందుకు పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదట. అయితే నిర్మాత నాగావంశి అత్యధిక రేటుకు సినిమా హక్కులను దక్కించుకొనడంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కాఫీ హక్కులు మేకర్స్ భారీ రేట్లు చెప్పడంతో.. కొనేందుకు ఎవరు ముందుకు రాలేదని.. దీంతో నిర్మాత నాగోవంశీతో ఆ డబ్బులు పెట్టించి హక్కులు కొనుగోలు చేయించినట్లు ఇండస్ట్రీలో టాక్. తెలుగు రాష్ట్రాల హక్కులను నాగవంశీ రూ.175 కోట్లకు కొన్నాడని సమాచారం.
ఒకవేళ అదే నిజమైతే దేవర రూ.350 కోట్ల గ్రాస్ రెండు తెలుగు రాష్ట్రాలు రీచ్ కావాల్సి ఉంటుంది. ఎంతో హైప్ ఉన్న సినిమాలక ఇది సాధ్యం. అయితే తారక్ కు నందమూరి కుటుంబాలతో ఉన్న విభేదాల కారణంగా మరింత కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. దేవర ఓపెనింగ్స్ పై ఖచ్చితంగా ఈ వివాదాలు ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ సినిమా హిట్ అయితే ఎవరూ ఆపలేరు అనుకోవడానికి ట్రైలర్ వచ్చాక దేవరపై ఉన్న భారీ అంచనాలు కూడా ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఇక నార్త్ బెల్ట్ లోను దేవర సినిమాను తీసుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో కరణ్ జోహార్ చేతిలో పెట్టేసారని టాక్. సాటిలైట్ హక్కులపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇలా విడుదలకు ముందే బిజినెస్ పరంగా దేవరపై ఎక్కడలేని నెగెటివిటీ వస్తున్న క్రమంలో.. దేవర ఆడియన్స్ ముందుకు వచ్చి ఈ నెగిటివ్ కామెంట్స్‌కు రిజల్ట్‌తో ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.