సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు లవ్, బ్రేకప్, డివోర్స్ లు ఇవన్నీ కామన్ గా మారిపోయాయి. ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ వివాహం చేసుకొని వారి పార్ట్నర్లకు విడాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి ముందు కూడా చాలామంది సెలబ్రిటీస్ ఇతరులతో ఎఫైర్ నడిపిన సంగటనలు ఉన్నాయి. ఇక వారితో బ్రేకప్ తర్వాత మరొకరిని వివాహం చేసుకుంటారు. అలా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఏకంగా ఆరు గురితో ఎఫైర్ నడిపిందట. అలాగే తర్వాత రెండు పెళ్లిళ్లు చేసుకున్నా.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోలో లైఫ్‌నే లీడ్ చేస్తుంది. ఇంతకు ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.. ఆమె చాలా పాపులర్ సెలబ్రిటీ. ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి ఆకట్టుకుంది. ఆమె నటంచని పాత్రలు లేవు. ఇక మొదటి నుంచి బాలీవుడ్ లో ఎప్పటికప్పుడు లవ్, బ్రేకప్స్ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
అలా ఈ అమ్మడు కూడా బాలీవుడ్ సెలబ్రిటీనే. ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదా.. తనే నటి రేఖ. రేఖ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి నెటింట వైరల్ అవుతూనే ఉంటుంది. సినిమాల కంటే వ్యక్తిగత కారణాలతోనే ఎక్కువ హాట్ టాపిక్ గా మారిన రేఖ.. గతంలో ఓసారి తన వైవాహిక జీవితాన్ని గురించి చెప్పుకొచ్చింది. ఈ అమ్మడి పెళ్లి జీవితం ఓ విషాదం. మొదట రేఖ ముఖేష్ అగర్వాల్‌ను వివాహం చేసుకోగా.. అతను పెళ్లయిన ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ టైంలో రేఖపై ఎన్నో ట్రోల్స్.. నెగిటివ్ కామెంట్స్.. వినిపించాయి. చాలామంది ఆమెను తీవ్రంగా విమర్శించారు. ముకేష్ చనిపోవడానికి తనే కారణమంటూ నిందలు కూడా వేసి అవమానించారు.
ఈ క్రమంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేఖ షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ముఖేష్.. రేఖ నుండి విడాకులు కోరారని.. రేఖ తన భర్త నుంచి విడాకులు కోరలేదని.. పెళ్లయ్యాక భర్త పెద్దగా పట్టించుకోకున్నా.. తాను ఎప్పుడూ సంబంధాన్ని వదులుకోవాలనుకోలేదని రేఖ వివరించింది. మేము లండన్ లో హనీమూన్ కి వెళ్దాం. ముఖేష్ రిలేషన్షిప్ లో తేడా కనిపించిందంటూ ఆమె వివరించింది. తర్వాత రేఖ దివంగత నటుడు వినోద్ మహ్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ.. వినోద్ మెహ్రా తల్లి రేఖను కోడలుగా అంగీకరించలేదు. వారి పెళ్లికి ఆమె నో చెప్పడంతో వినోద్.. రేఖను సిక్రెట్‌గ వివాహం చేసుకున్నారు. ఇద్దరు తమ వివాహ బంధాన్ని ఎప్పుడు రివిల్ చేయలేదు. అప్పటికే ఇద్దరు గురించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.
తర్వాత ఆయన చనిపోయారు. అయితే రేఖ ఇండస్ట్రీలో ఎంతోమందితో ఎఫైర్ నడిపిందని వార్తలు ఇప్పటికే వినిపిస్తూనే ఉంటాయి. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చెవి చూసిన రేఖ.. ప్రస్తుతం 69 ఏళ్ల వయసులోనూ ఒంటరిగానే జీవిస్తుంది. 2018 తర్వాత ఇండస్ట్రీకి కూడా దూరమైన ఈమె స్టార్టింగ్ లో అమితా బచ్చన్‌ను ప్రేమించినట్లు టాక్. అమితాబ్ తర్వాత నవీన్ నిశ్చల్, నటుడు జితేందర్, నటుడు కిరణ్ కుమార్ రాజబాబు, సంజయ్ దత్‌తో ను ఈమె ప్రేమాయణం నడిపిందని ఎప్పటికప్పుడు ఎఫైర్ వార్తలు వినిపిస్తూనే ఉండేవి. ఇక వీరితో పాటే రేఖ తన కంటే 13 ఏళ్ల చిన్నవాడైన అక్షయ్ కుమార్‌తో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి.