టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. స్క్రీన్ పై తారక్ కనిపిస్తే చాలు థియేటర్‌లు బ్లాస్ట్ అవ్వాల్సిందే. నటనలో, డ్యాన్స్ లో, డైలాగ్ డెలివరీలో ప్రేక్షకులను విపరీతంగా అకట్టుకునే తారక్‌కు ఫిదా కాని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. సినీ సెలెబ్రిటీస్ కూడా ఎంతోమంది ఆయనను అభిమానిస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు.. తారక్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాదు సీనియర్ ఆర్టిస్టుల నుంచి అప్ కమింగ్ యాక్టర్‌ల వరకు.. ప్రతి ఒక్కరు తారక్ పై తమ అభిమానాన్ని చాటుతూనే ఉంటారు.
ఎందుకంటే తారక్ అందరితో నడుచుకునే తీరు అలాంటిది. ప్రతి ఒక్కరితోను ఎంతో స్నేహంగా ఉండే తారక్.. తాను స్టార్ హీరో అని పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హీరో అని.. ఎప్పుడూ ఆలోచించరు. గర్వం ఇసుమంతైనా ఉండదు. చిన్నచిన్న ఆర్టిస్టులతో కూడా ఎంతో కలిసిపోతారు. అలా తాజాగా ఎన్టీఆర్ మంచి తనం గురించి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో కలిసి నాన్నకు ప్రేమతో సినిమా టైంలో జరిగిన ఓ సంఘటనను గురించి వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు.
తారక్ పెద్దాయన మనవడు.. అంటే నాకేమవుతాడో అందరికీ తెలుసు. ఇంతవరకు ఎవరికీ చెప్పని ఓ విషయం ఇప్పుడే చెప్తున్నా అంటూ.. నాన్నకు ప్రేమతో సినిమా క్లైమాక్స్ లో నేను నవ్వుతూనే చనిపోతా. ఆ సీన్ లో నటిస్తూ ఎన్టీఆర్ నన్ను పట్టుకుని దాదాపు గంటసేపు నిజంగా ఏడ్చేశాడు. మేమంతా కూడా ఎమోషనల్ ఆయ్యాం. తారక్‌ను ఓదార్చలేకపోయాం. నా వల్ల కాలేదు. నాన్న నేను ఇక్కడే ఉన్నాగా అని నేను చెప్పినా కూడా తారక్ కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూనే ఉన్నాడు. మేమిద్దరం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మా రిలేషన్ అలాంటిదే అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పకొచ్చాడు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.