హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో ‘ దేవర ‘.. సినిమాను వీక్షించనున్న స్టార్ సెలబ్రిటీస్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనున్న తాజా మూవీ దేవర. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ఈ సినిమా మొదటి భాగం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్‌కు మరికొన్ని రోజులు మిగిలి ఉండడంతో ఇప్పటికే టీం ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు. దేవర కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫ్యాన్స్ లో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. హాలీవుడ్ ఇండస్ట్రీలో జరగనున్న అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్‌లో దేవర సినిమాను ప్రదర్శించనున్నారట‌.

కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో అతి పెద్ద జోనర్ ఫిలిం ఫెస్టివల్.. బియాండ్ ఫెస్ట్‌ 2024 వేడుకను సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు గ్రాండ్ లెవెల్ లో జరుపుతున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 26న సాయంత్రం ఈజిప్ట్ థియేటర్లో దేవర సినిమాను ప్లే చేయనున్నారు మేకర్స్. హాలీవుడ్ ప్రముఖులతో పాటు.. అక్క‌డ స్టార్ సెల‌బ్రిటీస్‌, ప్రేక్షకులు కూడా దేవరను ఈ ఫెస్టివల్ లో వీక్షించనున్నారు. దీనికోసం తారక్ సెప్టెంబర్ 25 అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం.

దేవర సినిమా ప్రి సేల్ బుకింగ్స్ ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ లో ఇప్పటికే అత్యంత వేగంగా టికెట్లు కొనుగోలు అవుతున్న సంగతి తెలిసిందే. మిలియన్ డాలర్ల టచ్ చేసిన సినిమాగా ఇప్పటికే రికార్డ్‌ సృష్టించింది. దేవర ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే ఈ ఘనత సాధించిన మొదటి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ రికార్డ్‌ను దక్కించుకుంది. ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.