ఎంతమందితో నటించినా.. నా ఫేవరెట్ హీరోయిన్ మాత్రం ఆమె.. చిరంజీవి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి.. కెరీర్ స్టార్టింగ్ లో అందివచ్చిన పాత్రలో నటిస్తూ అంచలంచెలుగా ఎదిగి స్టార్ హీర్ ఇమేజ్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మెగాస్టార్. 150 కి పైగా సినిమాల్లో పదుల సంఖ్యలో హీరోయిన్స్ తో నటించి మెప్పించాడు. ఇక చిరుతో కలిసి నటించిన హీరోయిన్స్ లో ఎవరంటే ఆయనకు ఎక్కువ ఇష్టం అనే ప్రశ్నకు ఓ సందర్భంలో సమాధానం ఇచ్చారు.

Chiranjeevi at 69: Five films that showcases the Mega Actor behind the  Megastar | Telugu News - The Indian Express

గతంలో తన పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి తను నటించిన హీరోయిన్స్ లో ఆల్ టైం ఫేవరెట్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా.. నేను నటించిన హీరోయిన్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ కి నేను ఫిదా. హీరోయిన్స్ ఒక్కొక్కరు ఒక్కో విషయంలో ఎక్స్పర్ట్స్. రాధ గురించి చెప్పాలంటే తన డ్యాన్స్ అద్భుతం. శ్రీదేవి ఓవరాల్ గా పర్సనాలిటీ పరంగా సూపర్. సుమలత హోమ్లి రోల్స్‌కి క్యారఫ్ అడ్రస్. సుహాసిని మరో విధంగా గొప్ప. అలా ప్రతి హీరోయిన్ లో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ కి నేను అభిమానిని. అయితే మహానటి సావిత్రి, జయసుధ, వాణిశ్రీ తర్వాత విలక్షణత కలిగిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఆమె రాధిక. ఆమె ఎమోషన్, కామెడీ, క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలోనూ నటించేయగలరు.

Radhikaa Sarathkumar announces massive project with Chiranjeevi | Telugu  Movie News - Times of India

వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగలదు. అందుకే నాకు రాధిక అంటే చాలా ఇష్టం అంటూ వివరించారు. అలా చిరు తన ఆల్ టైం ఫేవరెట్ హీరోయిన్ రాధిక అని చెప్పక‌నే చెప్పేశారు. ఇక చిరంజీవి, రాధిక కాంబోలో ఎన్నో సినిమాలు తెర‌కెక్కాయి. అభిలాష, దొంగ మొగుడు, న్యాయం కావాలి, పట్నం వచ్చిన పతివ్రతలు ఇలా ఎన్నో సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. ఇక ఇప్పటికప్పుడు చిరు తన హీరోయిన్స్‌తో గెట్ టు గెదర్ అవుతూనే ఉంటారు. 1990 హీరోలు, హీరోయిన్స్ గతంలో ఓ చోట చెర్రీ సెలబ్రేషన్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. సోషియా ఫాంటసీ డ్రామాగా మల్లిడి వసిష్ట‌ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.