ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా దేవర మానియా నడుస్తుంది. ఏ నోట విన్న దేవర పేరే వినిపిస్తుంది. కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. తారక్ నుంచి ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో అభిమానులంతా ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు గ్లోబల్ ఇమేజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతున్న తారక్ సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.120 కోట్ల వరకు ప్రీ థియట్రికల్ బిజినెస్ జరగడం విశేషం. ఇది ఆల్ టైమ్ రికార్డ్ కాకపోయినా.. ఎన్టీఆర్ పేరు మీద ఏకంగా ఇంత బిజినెస్ జరగడం అంటే గొప్ప విషయం.
ఇక రికార్డ్ లెవెల్లో బిజినెస్‌లు జరగపోవడానికి సినిమా నుంచి వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ కూడా ఓ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా పక్కన పెడితే అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఈ అమ్మడు అందం, హవ భావాలతో కుర్రాళ్లను ఇప్పటికే ఫిదా చేసింది. సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న జాన్వి.. థియేట్రికల్ ట్రైలర్ లో డైలాగులతోను మెప్పించింది. అయితే జాన్వి తెలుగు యాసను చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇంత తెలుగు జాన్వికి ఎప్పుడొచ్చింది. అది కూడా నెల్లూరు, సీమప్రాంతాల మధ్యలో నివసించే జనాలు మాట్లాడే యాస ఇంత క్లియర్ కట్‌గా ఎలా మాట్లాడుతుందంటూ నోరెళ్ళబెట్టారు.
అయితే ఆ గొంతు జాన్వి కపూర్‌ది కాదని లేటెస్ట్‌గి వార్తలు వైరల్ అవుతున్నాయి. యాంకర్ గా భారీ పాపులారిటొ దక్కించుకుని.. నటిగాను దూసుకుపోతున్న అనసూయ దేవర జాన్వి రోల్‌కు డబ్బింగ్ చెప్పిందట. గతంలో కూడా అనసూయ వేదంలో ఓ హీరోయిన్ దీక్ష సేథ్‌కు డబ్బింగ్ చెప్పింది. ఈ సినిమా తర్వాత ఎంతో మంది హీరోయిన్స్‌కు అనసూయ డబ్బింగ్ చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు దేవరలో జాన్వి కపూర్‌కి కూడా ఆమె డబ్బింగ్ చెప్పిందని టాక్ నడుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై అనసూయ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి. కాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈనెల 22 నుంచి 25వరకు గ్రాండ్ లెవెల్‌లో జరిపించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ నెల 27న సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది.