టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ రేంజ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సెట్స్ పైకైనా రాకముందే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేస్తుందంటూ.. టాలీవుడ్ ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ పైకి వస్తుందా.. సినిమా కంటెంట్ ఏమై ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఇటీవల మహేష్ బాబు తాజా లుక్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.
గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ స్టైల్ తో మహేష్ వైల్డ్ లుక్ తో తాజాగా మెరిసాడు. ఇక రాజమౌళి సినిమా కోసం మహేష్ మేకోవర్ అవుతున్నారని అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి రానుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మూవీ కథంశము.. బ్యాక్ డ్రాప్ ఇవే అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా రానుందని.. ఆ కాలానికి తగ్గట్టుగా హైదరాబాదులో ప్రత్యేక సెట్లు వేయనున్నారని టాక్.
ఇక ఈ సినిమాలో దాదాపు 200 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు నటించనున్నారట. వారంతా ఓ గిరిజన తెగకు సంబంధించిన వారిని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ పాత్రలకు తగ్గట్టుగా యాక్టర్లను సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నారని టాక్. ఈనెలఖరికి ప్రధాన తారాగణంతో వర్క్ షాప్స్ మొదలుపెట్టి డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో నటించే ఇతర కాస్టింగ్ వివరాలపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. త్వరలోనే సినిమా పూజ కార్యక్రమాలను ప్రారంభించి ఈ విషయాలపై జక్కన క్లారిటీ ఇవ్వనున్నాడట.