సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ సినిమాలోని నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్.. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఇందులో నటించే స్టార్స్ గురించి.. ఈ సినిమా టైటిల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి క్రమంలో మహేష్ కూతురు సితార పేరు నెటింట తగ వైరల్‌గా మారింది. ఇప్పటికే సితార జ్యూవెలరీ యాడ్‌తో ఎలాంటి పాపులారిటీ దక్కించుకుందో తెలిసిందే. ఇక త్వరలోనే ఈ అమ్మడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ విషయాన్ని స్వయంగా సితార ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తన కెరీర్, స్టడీ, ఫ్యామిలీ విషయాలను పంచుకున్న ఈ చిన్నది.. తను చేసిన జ్యూవెలరీ యాడ్ చూసి తన తండ్రి ఏడ్చినంత పని చేశాడంటూ వివరించింది. ఇదిలా ఉంటే సితారకు సంబంధించిన ఓల్డ్ వీడియో నెటింట వైరల్ గా మారుతుంది. కొన్ని రోజుల క్రితం ప్రెస్ మీట్ లో పాల్గొన్న సితార యాంకర్స్ అడిగిన ఇంట్రెస్టింగ్.. ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడగ్గా.. తన తండ్రి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటూ వివరించింది. ప్రస్తుతం సితారకు సంబంధించిన ఈ వీడియో నెటింట వైరల్ గా మారుతుంది.
ఇక గతంలో మహేష్ బాబు, రష్మిక మందన జంటగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అలాగే అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత సితార రష్మికను కలిసిందట ఆమె అంటే తనకు చాలా ఇష్టమట. అంతేకాదు సితార తన యూట్యూబ్ ఛానల్ లో రష్మికను ఇంటర్వ్యూ కూడా చేసింది. ఇక సర్కార్ వారి పాట సినిమా ప్రమోషన్ సాంగ్ లో సితార కనిపించి ఆకట్టుకుంది. అలాగే మహేష్, శ్రీలీల కాంబోలో వచ్చిన గుంటూరు కారం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. శ్రీలీల కూడా తన ఫేవరెట్ అని తెలుస్తుంది.