రమా రాజమౌళి దగ్గర అప్పు తీసుకున్న ఆ క్రేజీ డైరెక్టర్.. కోట్లు వస్తున్న ఇంకా తీర్చక పోవడానికి కారణం అదేనా..!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్‌ల‌లో హను రాఘవపూడి ఒకరు. ఈయన చివరిగా తెర‌కెక్కించిన సీతారామం సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీకి దేశభక్తి జోడించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈయన.. ఈ సినిమాతో భారీ సక్సెస్ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం హ‌నురాఘవపూడి పాన్ ఇండియ‌న్ స్టార్‌ ప్రభాస్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సిద్ధమైన సంగతి తెలిసిందే. దాదాపు రూ.5కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. బ్రిటిష్ నేపథ్యంలో ఈ సినిమాలో ప్రభాస్ సోల్జర్ గా కనిపించనున్నాడు. ఇక హ‌నురాగపూడి అందాల రాక్షసి సినిమాతో డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే.

రాజమౌళి – రమ ల ప్రేమ.. పెళ్ళి వరకూ ఎలా వెళ్ళిందంటే?

ఈ సినిమాకు రాజమౌళి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. కెరీర్ బిగినింగ్లో ఈయనకు రాజమౌళి నుంచి మంచి ప్రోత్సాహం అందింది. హ‌ను త‌న సినిమాల‌తో విమర్శకుల ప్రశంసలు కూడా అఏదుకున్నాడు. తర్వాత కృష్ణ గాడి వీర ప్రేమ గాధ‌ సినిమాతో హను మొదటి సక్సెస్ అందుకున్నాడు. తర్వాత కొన్ని ప్లాప్‌లు పడినా.. సీతారామం సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ఈయన.. కోట్లల్లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.

Hanu Raghavapudi | దశాబ్దం అయిందంటే నమ్మలేకపోతున్నా..హ‌ను రాఘ‌వ‌పూడి ట్వీట్  వైర‌ల్-Namasthe Telangana

అయితే హను తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎదురైన‌ ఆర్థిక ఇబ్బందుల గురించి వెల్లడిస్తూ షార్ట్ ఫిలిం తీసేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో రాజమౌళి సతీమణి.. రమా రాజమౌళి దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకున్నానని.. ఇంతవరకు అప్పు చెల్లించలేదని సరదాగా చెప్పుకొచ్చాడు. ఎందుకు తిరిగి ఇవ్వలేదు అని ప్రశ్నిస్తే.. కొన్ని రుణాలు అలాగే ఉంచుకుంటే బాగుంటాయని వెల్లడించాడు. ఆ అప్పు ఎప్పటికీ ఇవ్వనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హను రాఘవపూడి చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవ్వడంతో హ‌ను రాఘవపూడి.. రాజమౌళి ఫ్యామిలీతో మరీ ఇంత క్లోజ్ గా ఉంటారా.. వీళ్ళ ఫ్యామిలీ మధ్య ఇంత‌ బాండింగ్ ఉందా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.