ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో నటించాలన్నా.. అందులో నా పాత్రే నాకు చాలా ముఖ్యం అంటూ స్టార్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ఇటీవల చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల స్త్రీ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ.. బాలీవుడ్లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌తో కలిసి పనిచేసే అవకాశాలు వచ్చిన కొన్ని కారణాల వల్ల ఈ సినిమాల్లో నటించలేకపోయాను అంటూ వివరించింది.
ఇక ఈమె మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో వరస ప్రాజెక్టులో అవకాశాలు వస్తూనే ఉన్న.. ఆ ప్రాజెక్ట్ ఇ్ట్రస్టింగ్గా లేదని పిస్తే, మీరు పోషించే పాత్ర ప్రాధాన్యత లేదు.. అది ఎదుటివారిని సవాల్ చేసేలా అనిపించేలేదంటే ఆ సినిమాను మీరు వదులుకుంటారు. లేకపోతే అందులో ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సరే దానిని రిజెక్ట్ చేస్తారంటూ వివరించింది.
నేను ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలనే విషయంపై చాలా క్లియర్ గా ఉంటానని.. మంచి కథలతో కూడిన సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని.. అద్భుతమైన దర్శకులతో సినిమా చేయాలని కోరుకుంటానంటూ వివరించింది. ఈ అంశాలకు తోడుగా ఆ ప్రాజెక్టులో అగ్రతారాలతో కలిసి పని చేసే అవకాశం వస్తే అప్పుడప్పుడు ఆ సినిమాను మరింత ఎగ్జిక్టెడ్ గా ఫీల్ అవుతానని.. సంతోషంగా యాక్సెప్ట్ చేస్తానని చెప్పుకొచ్చింది శ్రద్ధ కపూర్. ప్రస్తుతం శ్రద్ధ కపూర్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.