గతంలో అల్లు మెగా ఫ్యామిలీల మధ్యన ఎలాంటి బాండింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు, మెగా అంటూ రెండు కుటుంబాలుగా కాకుండా.. మెగా ఫ్యామిలీ అంటూ అందరినీ కలిసి మెగా ఫ్యాన్స్ ఎంతో గౌరవంగా ఆరాధించేవారు. అయితే అల్లు అర్జున్.. మెగా, అల్లు ఫ్యామిలిలను రెండుగా విభజించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అప్పటి నుంచి నెటింట మెగా ఫ్యాన్స్.. అల్లు ఫ్యాన్స్ మధ్యన గొడవలు మొదలయ్యాయి. స్టార్ హీరో స్థానంలో ఉండి ఎలాంటి హీరో కూడా.. హీరోల మధ్యన పుల్లలు పెట్టే ప్రయత్నాలు చేయరు. కానీ.. అల్లు అర్జున్ మాత్రం రిపీటెడ్ గా అదే చేస్తున్నారు. మొదట ఓ సినిమా ప్రమోషన్స్‌లో పవన్ కళ్యాణ్ గురించి అభిమానులు బన్నీని అడగగా.. చెప్పను బ్రదర్ అంటూ ఓపెన్ కామెంట్ చేసి.. వారి ఎమోషన్స్‌ను దెబ్బతీశాడు.
తర్వాత సమస్య సర్దుకుంది అనుకునేలోపు.. మరోసారి పవన్ కళ్యాణ్.. జనసేన తరపున చరణ్ ప్రచారానికి వెళితే.. బన్నీ మాత్రం వైసీపీ తరఫున తన స్నేహితుడికి అండగా ప్రచారానికి వెళ్లి అగ్గి రా చేశాడు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ పై విరుచుకుపడ్డారు. ఆయన్ను విపరీతంగా తిడుతూ ట్రోల్స్ చేశారు. ఇక ఈ గొడవ సర్దుకుందిలే అనుకునేలోపు.. మరోసారి చర్చకు కారణం అవుతున్నాడు అల్లు అర్జున్. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్ళిన అల్లు అర్జున్.. అక్కడ నాకు నచ్చినట్లే నేను ఉంటాను.. నేను ఎవరి కోసం మారను అంటూ ఇన్ డైరెక్ట్ గా ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టే కామెంట్స్ చేశాడు. ఇలా బన్నీ తరచూ మెగా, పవన అభిమానులు.. ఆయనపై కోపాన్ని మరిచిపోయేలోపు మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ హైలైట్ గా అవుతున్నాడు. గతంలో తండ్రి అల్లు అరవింద్ కంటే చిరంజీవి అంటే ఆయనకు ఎంత ఇష్టమని ఓపెన్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
అలాంటిది మెల్లమెల్లగా చిరంజీవిపై కూడా ఆయన ఇష్టం కరిగిపోతుందని తెలుస్తుంది. ఇక నిన్న చిరు 62వ పుట్టినరోజు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం ఏడు గంటలకు ఏదో మోక్కుబడిగా చిరంజీవికి పుట్టినరోజు విషెస్ తెలియజేశాడు. ట్విట్ లో ఎలాంటి ఆప్యాయత కానీ.. ప్రేమ కానీ చూపించలేదు. కానీ.. ఎలాంటి సంబంధమూ లేని జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు మాత్రమే ఎంతో ఆప్యాయంగా ట్విట్ చేస్తూ బర్త్డే విషెస్ తెలియజేశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు బావ అంటూనే.. దేవరా సినిమా డైలాగుని కూడా అదనంగా యాడ్ చేసి.. ఫైర్ బొమ్మతో ట్వీట్ చేశాడు. అసలే బంధుత్వం లేని వ్యక్తికి ఎనలేని ప్రేమ చూపించే ఈయన.. కెరీర్‌లో ఎదిగేందుకు ఎంతో తోడ్పడిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లపై మాత్రం కనీస బాధ్యతను కూడా చూపించడం లేదు. వీరిని త్వరగా వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ అభిమానులు ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఆయన ఒక్క భారీ విజయం.. బన్నీలో అహంకారాన్ని ఎంతగా పెంచేసిందో అర్థం చేసుకోవచ్చు అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.