టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ కు తెలుగు ప్రేక్షకుల పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా రావు రమేష్ హీరోగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం టైటిల్ తో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సాధారణంగా చిన్న సినిమాలుగా తెరకెక్కిన.. ఈ సినిమాపై మెదటి నుంచి ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. దానికి కారణం సుకుమార్ భార్య ఈ సినిమా ప్రొడ్యూసర్ లో ఒకరు కావడమే. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేయడం మరింత బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక నేడు (ఆగస్టు 23న) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ సినిమా ఎలా ఉంది.. రావు రమేష్ హిట్ కొట్టాడా..? లేదా..? ఒకసారి చూద్దాం.
స్టోరీ
మారుతి నగర్‌కి చెందిన సుబ్రహ్మణ్యం(రావు రమేష్) 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వడం.. కోర్ట్ స్టే కారణంగా అది హోల్డ్ లో ఉండిపోవడంతో చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని అప్పటినుంచి ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటాడు సుబ్రహ్మణ్యం. ఇక భార్య కళారాణి(ఇంద్రజ) గవర్నమెంట్ ఆఫీస్ లో క్లర్క్జ ఈ ఇద్దరి కొడుకే అర్జున్(అంకిత్ కొయ్య) అప్పులతో సంసారం చేస్తున్న సుబ్రహ్మణ్యం అకౌంట్లో సడన్గా రూ.10 లక్షలు వచ్చి పడతాయి. ఇంతకీ రూ.10 లక్షలు వేసింది ఎవరు..? గవర్నమెంట్ జాబ్ వచ్చిందా..? లేదా..? అనేదే స్టోరీ.
విశ్లేషన
ప్రస్తుతం ఆడియన్స్ అంత సినిమాల్లో కంటెంట్ ఉందా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు. ఎంత స్టార్ హీరో, హీరోయిన్లు అయినా కంటెంట్ లేకపోతే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో రావు రమేష్ హీరోగా తాజాగా సినిమాను తెరకెక్కించారు. అప్పుడెప్పుడో 1998లో టీచర్ జాబ్ రావడం.. కోర్ట్ జాబ్ హోల్డ్ చేయడం.. అకౌంట్లో డబ్బులు అనుకోకుండా వచ్చి పడడం.. ఇవన్నీ సాధారణంగా జరిగిన వార్తలను కాన్సెప్ట్ గా తీసుకొని తెరకెక్కించారు. మారుతి నగర్ అనే ప్రాంతం నుంచి సినిమా మొదలైంది. సుబ్రహ్మణ్యం అసలు ఎలాంటి వాడు.. అతడు కుటుంబ పరిస్థితి ఎలా ఉంది.. అనేది క్లియర్గా ఇంట్రడక్షన్ తో వివరించారు. ఓవైపు కథ చెబుతూనే కొన్ని కామెడీ సన్నివేశాలు, ఎమోషనల్ సన్నివేశాలు కూడా పేర్చుకుంటూ సినిమాను ముందుకు తీసుకువెళ్లారు. సిచువేషన్ కామెడీతో రాకుండా సన్నివేశాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. కొన్ని సీన్స్‌కు మాత్రం నవ్వు రాదు.
ఇంతకీ రూ.10 లక్షలు సుబ్రహ్మణ్యం అకౌంట్లోకి ఎవరు వేశారు..విశ్లేషన అనే చిన్న పాయింట్ చుట్టూ సినిమా చాలా జాగ్రత్తగా నడిపారు. రావు రమేష్ కూడా సగటు తెలుగు హీరోలా స్లో మోషన్ షాట్స్, డ్యాన్సులు వేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతా బాగానే ఉన్నా ఇందులో సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్ ప్రేమించిన కాంచన అనే అమ్మాయి సీన్లు మరి సినిమాటిక్ గా, లాజిక్ లెస్ గా అనిపించాయి. ఇక మెగా, అల్లు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు.. అల్లు అర్జున్, చిరంజీవిలను రిఫరెన్సులుగా సినిమాల్లో ఉంచారు. అయితే అవి పర్ఫెక్ట్ గా కుదిరేశాయి. ఇక అర్జున్ లవర్ కాంచన అయితే తల్లిదండ్రులు ముందే రిలేషన్, బ్రేకప్ లాంటి వాటిని సాధారణంగా ఫ్రెండ్స్ తో మాట్లాడినట్లు మాట్లాడేస్తుంది. తల్లిదండ్రులు కూడా పెద్దగా షాక్ కాకుండా అదేదో నార్మల్ థింగ్‌లా తీసుకుంటూ ఉంటారు. రియల్ లైఫ్ లో ఇలా ఎవరు ఉండరు.. ఇదంతా సినిమాల్లోనే జరుగుతుంది అనిపించేలా ఈ సన్నివేశాలు ఉన్నాయి. అలానే సినిమాల్లో లక్షల డబ్బుని చాలా సులభంగా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇదంతా కాస్త లాజిక్ లెస్ గా అనిపించింది. ఇలా చిన్నచిన్న పొరపాట్లు కొన్ని ఉన్నా ఓవరాల్ గా అయితే సినిమా సరదాగా ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఉంది.
ఎవరెలా నటించారంటే..?
రావు రమేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయి నటించే రావు రమేష్ సుబ్రహ్మణ్యం పాత్రలో ప్రవేసించి మరి నటించాడు. ఇతడు కొడుకుగా అంకిత్ కొయ్య తన నటనతో ఆకట్టుకున్నాడు. మొన్న ఆయ్ సినిమాలో నటించిన అంకిత్.. ఇప్పుడు ఈ సినిమాలోని మెప్పించాడు. ఇక కాంచన పాత్రలో నటించిన రమ్య పసుపులేటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. కేవలం గ్లామర్ కోసమే ఆమెను చూపించినట్లు అనిపించింది. ఇంద్రజ కూడా స్టార్టింగ్‌లో ఎమోషనల్ అవ్వడం.. చివర్లో డ్యాన్స్ చేయడం తప్ప.. పెద్ద స్కోప్ కనిపించలేదు. మిగిలిన పాత్రలో ప్రవీణ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరులు పర్లేదు అనిపించారు.
టెక్నికల్
సినిమా హుందాతనంగా.. సినిమాటోగ్రఫీ రిచ్‌గా కనిపించింది. పాటలు వినడానికి.. చూడడానికి.. కూడా బాగా అనిపించాయి. రైటర్ కం డైరెక్టర్ లక్ష్మణ్ కార్యా సింపుల్ స్టోరీ లైన్ తనదైన స్టైల్ లో కామెడిమిక్స్ చేసి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశారు. గతంలో హ్యాపీ వెడ్డింగ్ మూవీ తో ఆకట్టుకుని.. ఇప్పుడు ఈ సినిమాతోను ప్రేక్షకులను మెప్పించాడు.
ఫైనల్గా
ఫైట్లేమీ లేకుండా.. భారీ డైలాగ్‌లు వాడకుండా సింపుల్ కథతో మనసారా కాసేపు నవ్వుకొని సరదాగా సినిమా చూడాలనుకునే వాళకి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం.. గుడ్ ఆప్షన్.