అక్కినేని ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతున్న శోభిత ధూళిపాళ్ల, నాగ చైతన్య గత కొద్దిరోజులుగా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరూ ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న ఈ జంట.. ఈ ఏడాది చివర్ల వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. ప్యారెస్‌లో చైతు.. శోభితల వివాహం గ్రాండ్ లెవెల్ లో జరగబోతుందని టాక్.
దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందట. ఇదిలా ఉంటే ప్రస్తుతం అటు చై, ఇటు శోభిత తమ సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. వీరిద్దరు ప్రాజెక్టులు పుర్తైన వెంటనే పెళ్లి పనుల్లో బిజీ అవుతారట. కాగా ఇలాంటి క్రమంలో ఓ బడా ప్రాజెక్టులో అక్కినేని కోడలు శోభితకు ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ మూవీలో ఐటెం సాంగ్ కోసం మేకర్స్ శోభితను అప్రోచ్ అయ్యారట.
రణ్‌బీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్ 3లో శోభితతో ఐటమ్ సాంగ్ చేయించాలని మేకర్స్ భావిస్తున్నట్లు.. ఇందులో భాగంగానే ఇప్పటికే శోభితను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. అయితే శోభిత ఈ పాటకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.. లేదా.. అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అసలే నాగచైతన్యతో పెళ్లికి సిద్ధమైన శోభిత.. ఇప్పుడు అక్కినేని కోడలుగా ఐటమ్ సాంగ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.. లేదా.. అసలు నిజంగానే డాన్ 3లో శోభిత ఉంటుందా.. తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.