ఇంద్ర రీ రిలీజ్ లో ఆ సీన్‌కు అల్లు అర్జున్ అంటూ కేకలు.. ఇదెక్క‌డి దారుణం రా బాబు..!

తాజాగా మెగాస్టార్ చిరంజీవి 62వ పుట్టినరోజును గ్రాండ్ లెవెల్లో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అందులోను బాస్ ఆల్ టైం హిట్ మూవీ ఇంద్ర సినిమాను కూడా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చారు. ఈ క్రమంలో థియేటర్స్ లో ఫ్యాన్స్ గోల మామూలుగా లేదు. కుర్రాళ్ళ‌తో పాటు పెద్దోళ్ళు కూడా ధియేటర్లలో సందడి చేశారు. చిరు స్టెప్పులు, డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్‌ల‌కు.. విజిల్స్, క్లాప్స్, కేకలతో థియేటర్లను షేక్ చేసి పడేసారు. అయితే ఇంద్ర సినిమాలో ఓ ముఖ్యమైన సీన్‌ వచ్చినప్పుడు మాత్రం మెగా అభిమానులంతా అల్లు అర్జున్ అంటూ అరవడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇంద్ర మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ ముందు ఓ డ్రామా మొదలవుతుంది.

Chiranjeevi's Indra producers confirm the re-release - TrackTollywood

తన మేనకోడలికి తన దగ్గర పనిచేసే కుర్రాడుతో పెళ్లి చేస్తాడు మెగాస్టార్. ఆ టైంలో ఆర్తి అగర్వాల్ తన వాళ్ళతో కలిసి అక్కడకు ఎంట్రీ ఇస్తుంది. వెంటనే తాళి కట్టాల్సిన పెళ్లి కొడుకు చిరంజీవికి, ఆయన మేనకోడలికి వెన్నుపోటు పొడిచి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఆ సీన్ అప్పట్లో థియేటర్స్ లో సందడి చేస్తున్న ఆడియన్స్ కు మైండ్ బ్లాక్‌లా అనిపించింది. ఇక ఇప్పుడు అదే సీన్ వస్తున్నప్పుడు మెగా ఫాన్స్ నక్క.. నక్క.. అంటూ అల్లు అర్జున్‌ను ట్రోల్ చేస్తూన్నారు. అల్లు అర్జున్ కెరీర్‌ మొదట్లో తను ఈ స్థాయికి రావడానికి మెగా ఫ్యామిలీ చిరంజీవి కారణమంటూ.. చాలాసార్లు వివరించాడు. ఇప్పుడు ఓ స్థాయికి వచ్చాక మెగాస్టార్ పేరు కూడా మాట్లాడట్లేదు. అందుకే గుంటనక్క అని అరుస్తున్నట్లు పోస్ట్ షేర్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Indra Movie Chiranjeevi Emotional Scene || Aarthi Agarwal || Mukesh Rishi  || Sivaji || Matinee Show

ఈ వీడియోలు వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వారికి కౌంటర్లు వేస్తూ బండబూతులు తిడుతున్నారు. బన్నీ తన స్టార్డంతో పైకి వచ్చాడని.. ఎవరు ఏ హెల్ప్ చేయలేదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఇక గత కొంతకాలంగా అల్లు వ‌ర్సెస్ మెగా వివాదం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్ళాడు బ‌న్నీ. మరోసారి ఈ వివాదాన్ని మరింతగా పెంచే కామెంట్ చేశాడంటూ.. ఫ్యామిలీకి ఇన్‌డైరెక్ట్ గా కౌంటర్లు వేసారంటూ అభిమానులు భావిస్తున్నారు. ఇక డిసెంబర్ 6న పుష్ప 2తో బన్నీ బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అదే నెలలో రామ్ చరణ్ నుంచి గేమ్ చేంజ‌ర్ సినిమా కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక బన్నీ, చరణ్ మధ్యన ఈ పోటీలో ఎవరు టాప్ లో నిలుస్తారో అనే ఆసక్తి ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకల్లో నెలకొంది.