టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక త్వరలోనే మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నో ప్రముఖ సంస్థలు.. మహేష్ బాబు క్రేజ్‌ను భారీ లెవెల్ లో ఉపయోగించుకుంటున్నాయి. యాడ్ వరల్డ్‌లో ఇప్పటికే మహేష్ బాబును మించిన సందేహం లేదు. అంతేకాదు మహేష్ ఇతర హీరోల సినిమాలుకు వాయిస్ ఓవర్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. తనతో సరి సమానమైన ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల సినిమాలకు కూడా మహేష్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ఇక ఆ సినిమా సక్సెస్ విషయంలో మహేష్ బాబు పాత్ర కూడా ఉంటుంది. ఇప్పుడు మహేష్ వాయిస్ ఓవర్‌ని హాలీవుడ్ సిని ప్రొడ్యూసర్లు కూడా వాడుకోవడానికి సిద్ధమయ్యారు.
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ లేటెస్ట్గా ముసాఫా ది లయన్.. సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 28న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డిస్నీ సంస్థవారు రీసెంట్‌గానే సూపర్ స్టార్ మహేష్ బాబును కలిసి ఒప్పందం చేసుకున్నారట. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో ముసాఫా పాత్రకి మహేష్ బాబు తన గాత్రాన్ని అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ నెల 26వ తేదీన తెలుగు వెర్షన్ల దీ లయన్ కింగ్ ముసాఫా ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇందులో మహేష్ బాబు వాయిస్ మనం వినబోతున్నాం. ఈ క్రమంలో మహేష్ బాబు దీనిపై మాట్లాడుతూ.. నాకు డిస్నీ సంస్థ అంటే చాలా గౌరవం అన్ని.. ఆ సంస్థతో కలిసి పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ వివరించింది.
తన కొడుకుని సరైన మార్గంలో నడిపించే ముస్తఫా అడవికి ఓ గొప్ప రాజుగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేను కూడా అంతే ఆసక్తిగా చూస్తున్నా. డిసెంబర్ 20న నా కుటుంబంతో కలిసి అభిమానులతో ఈ సినిమా ధియేటర్లో చూస్తా అంటూ ఆయన వివరించాడు. ప్రస్తుతం మహేష్ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక 2019లో రిలీజ్ అయిన లైన్ కింగ్స్ సినిమాకు సీక్వల్గా ముసాఫా రిలీజ్ కానుంది. ఇక అప్పట్లో రిలీజ్ అయిన ఈ మూవీ సంచలన బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 1.6బిలియన్ డాలర్లు వసూలు సాధించి రికార్డ్ సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అత్యధిక వాసుళు సాధించింది. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. మరో పక్క ఈ సినిమా రిలీజ్ అయ్యే రోజునే.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా రిలీజ్ కానుండడం విశేషం.