ఎప్పటికప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. స్టార్‌డంను సంపాదించుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తారు. అయితే కొంతమంది మాత్రం తమ మొదటి సినిమాతో సక్సెస్ వచ్చిన ఏవో కారణాలతో ఇండస్ట్రీకి దూరమైపోతూ ఉంటారు. అలా తళుక్కున తెరపై మెరిసి ఒక్క సినిమాతోనే మాయమైపోయిన హీరోయిన్లలో దివ్య ఖోస్లా కుమార్ ఒకటి. ఈ పేరు చెప్తే టాలీవుడ్ ప్రేక్షకులకు టక్కన గుర్తుకు రాకపోవచ్చు.
అయితే దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ లవ్ టుడే సినిమాలో నటించిన హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. టాలీవుడ్ లో ఈ అమ్మడు నటించింది కేవలం ఒకే ఒక్క సినిమా అయినా.. తనకంటూ మంచి క్రేజ్‌ను ఏర్పరచుకున్న దివ్య. తర్వాత మళ్లీ తెలుగులో మరే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఉదయ్ కిరణ్ జంటగా 2004లో రిలీజ్ అయిన లవ్ టుడే సినిమాతో తన సినీ ప్రయాణం మొదలుపెట్టిన దివ్య ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కు జంటగా నటించి తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకుంది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి ముద్ర వేసుకునా దివ్య కు ఈ సినిమా తర్వాత ఊహించిన రేంజ్ లో అవకాశాలు రాలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇక చాలాకాలం గ్యాప్ తర్వాత బాలీవుడ్ లో ఓ మంచి అవకాశాన్ని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ అప్ తుమారే హవాలే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ బడా ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ అంతా నటించడం విశేషం. చాలా కాలం గ్యాప్ తర్వాత దివ్య నటిస్తున్న ఈ సినిమాను హిందీ తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్‌లో దివ్య ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. వరుస అవకాశాలను అందిపుచ్చుకొని రాణిస్తుందో లేదో వేచి చూడాలి.