అలనాటి క్రేజీ హీరోయిన్ సంఘవికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరంలేదు. తనదైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. లక్షలాదిమంది హృదయాలో చెరగని ముద్ర వేసుకుంది. అతితక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. దాదాపు 15 ఏళ్ల తన సినీ కెరీర్‌లో తెలుగుతోపాటు.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 80కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక సంఘవి అసలు పేరు కావ్య రమేష్. డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సంఘవిగా తన పేరును మార్చుకుంది. ఇక హీరో శ్రీకాంత్ నటించిన తాజ్‌మహల్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది.
మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్న సంఘవి.. కృష్ణవంశీ డైరెక్షన్‌లో తెరకెక్కిన సింధూరం సినిమాతో ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది. 1997లో రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. సంఘవికి స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు కట్టాయి. దీంతో అమ్మడు బిజీ హీరోయిన్గా మారిపోయింది. అది తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్గా వెలిగిపోయింది. 2005 లో ఒక్కడే కానీ ఇద్దరు సినిమాతో టాలీవుడ్ లో చివరిగా నటించి మెప్పించింది. ఇక 2008లో కన్నడలో తెరకెక్కిన ఇంద్ర సినిమాతో ఆడియన్స్ మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది.
తర్వాత పలు బుల్లితెర సీరియల్స్ లో నటించి మెప్పించింది. గోకులతిల్ సీతై, సావిత్రి, కాలభైరవ లాంటి సీరియల్స్ లో నటించి మెప్పించింది. తర్వాత ఊహించిన రేంజ్ లో ఆఫర్లు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన సంఘవి.. 2016లో ఐటి ఉద్యోగి వెంకటేష్‌ను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మడుకు ఓ పాప కూడా ఉంది. సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ.. తనకు, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ అభిమానులను ఫీదా చేస్తుంది. అయితే సంఘవి లేటెస్ట్ ఫోటోస్‌లో ఒకప్పుడు సినిమాల్లో కనిపించిన దానికంటే రెట్టింపు అందంతో మెరుస్తు అభిమానులను ఆకట్టుకుంటుంది.
View this post on Instagram