బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కపుల్‌లో ఒక్కరైనా సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ జంటకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈ జంట పెళ్ళికి ముందు కొన్నేళ్ళు డేటింగ్ చేసిన తర్వాత 2012లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్‌కు ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే. మొదటి నటి అమృత సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఏవో కారణాలతో ఆమెతో విడాకుల తీసుకున్న సైఫ్ కొంత కాలం తర్వత కరీనాకపూ్‌ర్ను వివాహం చేసుకున్నాడు.
ఈ జంటకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కరీనాకపూర్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తను అమృత సింగ్‌కు పెద్ద ఫ్యాన్‌నంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ సైఫ్ అలీ ఖాన్‌కు అంతకుముందే వివాహం జరిగిందని నాకు తెలుసు అని.. అప్పటికే ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. అతని కుటుంబాన్ని నేను ఇప్పటికీ గౌరవిస్తా.. నేను కూడా ఆయన మొదటి భార్య అమృత సింగ్‌కు ఫ్యాన్‌ని అంటూ వివకరించాడు.
నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు కానీ.. నాకు ఆమె గురించి సినిమాల ద్వారా తెలుసు అంటూ వివరించింది. ఆమెకు కూడా సైఫ్ ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తారని.. ఎందుకంటే ఆమె మొదటి భార్యనే కాదు.. అతని పిల్లల తల్లి కూడా. సైఫ్ లాగే నేను ఆమెను గౌరవిస్తా. ఇది నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నా అంటూ వివరించింది. ఇక సైఫ్, అమృత సింగ్ జంటకు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరీనా. సైఫ్ జంటకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.