సమంత సిటాడల్ కు అదిరిపోయే రెస్పాన్స్.. బ్లాక్ బస్టర్ పక్కా అంటున్న ఫ్యాన్స్..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత న‌ట‌న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను నటించిన ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటూ స్టార్ బ్యూటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కొత్త జోనర్‌లోను సినిమాలో నటిస్తూ తన సత్తా చాటుకుంటుంది. తాజాగా త‌ను న‌టించిన సిటాడెల్‌తో యాక్షన్ స్క్రిప్ట్ అంటే ఆలోచించకుండా స్యామ్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చని కాన్ఫిడెన్స్ మేకర్స్ లో క్రియేట్ చేసింది ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యూటీ.

గ‌తేడాది సమంత నటించిన సిటాడెల్ టీజర్ చూసిన అభిమానులంతా ఆమె నటనకు ఫీదా అవుతున్నారు. క్షణం కూడా ఊపిరి పీల్చుకొనివనంత ఇంటెన్స్ సీన్స్‌లో న‌టించి హైలెట్ గా నిల్చింది. ఇప్పుడు సిటాడెల్‌ హనీబ‌నీ టీజర్ చూసిన వాళ్లంతా దీని గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం నెటింట ఈ టీజర్ చర్చనీయాంసంగా మారింది. ఇందులో సమంత ఫిట్నెస్‌కు ఫాది అవుతున్నారు ఆడియన్స్. అంతకుముందు రాజ్ అండ్‌ డీకే డైరెక్షన్‌లో ఫ్యామిలీమ్యాన్ 2 యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇరగదీసిన శ్యామ్.. మ‌రోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

ఈసారి ఒక అడుగు ముందుకేసి మరి స్టైలిష్‌గా.. గన్స్ పట్టుకుని యాక్షన్ సీన్స్ తో అదరగొట్టింది. ఓవైపు సరదా అమ్మాయిగా కనిపిస్తూనే.. మరోవైపు ఇంటెన్స్ సీన్స్‌లోనూ.. యాక్షన్ ఎపిసోడ్స్ లోను నటిస్తూ మెప్పించింది. ప్రస్తుతం సిటాడెల్‌ టీచర్ చూసిన ప్రేక్షకులంతా వరుణ్ ధావన్, స‌మంత ఇద్దరికి ఇది పర్ఫెక్ట్ సిరీస్ అవుతుందని.. కచ్చితంగా ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ పక్క అంటూ.. ఇన్నాళ్లు ఎదురుచూసిన దానికి సరైన ఫలితం ఉంటుందంటూ.. మోస్ట్ అవైటెడ్ గా దీనికోసం ఎదురు చూస్తున్నాం అంటూ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ సిరీస్‌ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.