సినీ ఇండస్ట్రీలో వారసత్వంగా హీరో, హీరోయిన్లు ఎంతోమంది అడుగుపెట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లను అలా నటవారసులుగా ఎంతోమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు. అయితే ఇండస్ట్రీకి హీరోయిన్లు అడుగుపెట్టిన నట వారసులు మాత్రం సక్సెస్ అయిన వారు అసలు కనిపించరు. బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్స్ నట వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌లుగా ఎదిగినప్పటికీ.. టాలీవుడ్‌లో మాత్రం తల్లిదండ్రులకు ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి రాణించలేకపోతున్నారు. అలా ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ నుంచి సుప్రియ నటిగా ఎంట్రీ ఇచ్చి.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించింది. అయితే ఊహించిన రేంజ్ లో అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ.. చాలా గ్యాప్ తర్వాత గూఢాచారి సినిమాలో ఓ కీ రోల్‌లో నటించి మెప్పించింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ నటవరసరాలుగా మంజుల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఈమె కూడా ఎక్కువ సినిమాల్లో రాణించలేకపోయింది. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి మెగా డాటర్ నిహారిక ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్‌లు అందుకోలేకపోయింది. రాజశేఖర్ – జీవిత.. నటవారసులుగా వారి కూతురు శివాని, శివాత్మిక కూడా టాలీవుడ్ హీరోయిన్‌లుగా ఇంట్రీ ఇచ్చారు. ఇక శివాని రాజశేఖర్ పెళ్లి సందడి సినిమాల్లో ఓ చిన్న రోల్ లో నటించి మెప్పించింది. రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాల్లో ఈ అమ్మడు కనిపించినా పూర్తిస్థాయిలో హీరోయిన్గా మాత్రం శివాని కెరీర్ మరోసారి ప్రారంభించింది. అప్పటినుంచి వరుసగా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్గా రాణిస్తున్న ఈ అమ్మడు.. తమిళ్లో ఇప్పటికి రెండు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక గతేడాది కోటబొమ్మాలి పీయస్ సినిమాతో సక్సెస్ అందుకున్న శివాని.. ఈ ఏడాది వింధ్యవాసుల అహం మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.
ఇప్పటివరకు చేసిన సినిమాలతో శివాని తన నటనతో విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. గ్లామర్ విషయంలో లిమిట్స్ ఉన్న తన అందంతో ఆకట్టుకుంటున్న శివాని.. ట్రెడిషనల్ లుక్ లోను అందాలు ఆరబోయొచ్చని కొత్త అర్ధాన్ని చూపిస్తుంది. ఇప్పటికే తన ఇన్స్టా వేదికగా ఎన్నో ఫోటోలను షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. రెగ్యులర్గా ఫోటోలు ఇన్స్టాల్ లో షేర్ చేసుకుంటూనే వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా చిరుత కలర్ డిజైన్‌తో ఉన్న లాంగ్ ఫ్రాక్ లో హై హీల్స్ వేసుకొని హాట్ లుక్స్ లో మెప్పించింది. ఈ అమ్మడు మెస్మరైజింగ్ లుక్స్ చూసిన నెటిజన్స్ అంతా ఫిదా అవుతున్నారు. కళ్ళతో మాయ చేస్తున్న శివాన్ని స్వర్గం నుంచి దిగివచ్చిన ఏంజెల్ లాగా ఉందంటూ.. ఏం ఫిగర్‌గా బాబు టూ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన అందం, అభినయానికి తగ్గ క్యారెక్టర్స్ పడితే కచ్చితంగా సౌత్‌లో టాప్ హీరోయిన్గా శివాని ఉంటుందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.