సుకుమార్ వివాదానికి దిల్ రాజు చెక్.. అసలేం జరిగిందంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు కావాలని కలలు కంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. అయితే కొంతమందికి మాత్రమే అవకాశాలు దక్కుతాయి. అవకాశాలు దక్కిన ప్రతి ఒక్కరు సక్సెస్ అందుకుని స్టార్ట్ డైరెక్టర్లుగా నిలవడం అనేది కూడా సాధ్యం కాదు. అయితే ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకులు టాలీవుడ్‌లో ఎంతోమంది ఉన్నారు. వారిలో సుకుమార్ కూడా ఒకరు. సుకుమార్ తెర‌కెక్కించే ప్రతి సినిమాలోను వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటు ఉంటాడు.

ఇలా తాను తెర‌కెక్కించిన దాదాపు అన్ని సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంటు స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్న సుకుమార్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. చివరిగా తెర‌కెక్కిన‌ పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌గా నిలబడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పుష్పాను మించి బ్లాక్ బస్టర్ ఖాయం అంటూ మేకర్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు సినిమాని చూస్తామా అంటూ అభిమానులు కూడా వేయికళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇండస్ట్రీలో అందరితో సన్నిహితంగా ఉంటూ ఫ్రెండ్లీగా ఉండే సుకుమార్‌కు.. గతంలో తను తెర‌కెక్కించిన జగడం సినిమా షూట్ టైంలో ఆ మూవీ ప్రొడ్యూసర్‌తో పెద్ద వివాదం తలెత్తిందంటూ అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలకు టాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చెక్ పెట్టారట. వారిద్దరి మధ్యన వివాదాన్ని సద్దుమణిగేలా చేసి ఆ గొడవకు పరిష్కారాన్ని చూపించాడట. ఏది ఏమైనా సుకుమార్‌కు మొదటి అవకాశం ఇచ్చి స్టార్ డైరెక్టర్గా నిలబెట్టిన దిల్‌రాజు.. సుకుమార్ వివాదాల్లో చిక్కుకున్న సమయంలో కూడా ఆయనకు అండగా నిలవడం.. స‌హ‌యం చేయ‌డం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.