ఏపీ, తెలంగాణ‌లో ఇక పెళ్లిళ్ల మోత మోగి పోవాల్సిందే..?

తాజాగా ఆషాడమసానికి ఏండ్ కార్డ్‌ప‌డి శ్రావణ మాస్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాహాలతో పాటు.. ఎన్నో శుభకార్యాలకు మంచి ముహూర్తాలు లేని రోజులకు చెక్ పడింది. శుభలగ్నాలు.. శ్రావణమాసం వచ్చేయడంతో.. ఇంతకాలంగా పెళ్లిళ్లు మొదలుకొని.. శుభకార్యాలు చేసుకోవాలనుకున్న వారందరి ఎదురుచూపులకు చెక్ పడింది. మంచి రోజులు వచ్చేసాయి. ఈ నెలంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిల‌మోత మోగిపోవాల్సిందే. అయితే ఈ నెలలో ఎప్పటి నుంచి శుభముహూర్తాలు మొదలయ్యాయి.. ఏ.. ఏ.. తేదిల్లో శుభకార్యాలకు మంచి సమయం ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం.

ఈ నెలలో నేడు అంటే ఆగస్టు 7 నుంచి శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. పురోహితులు, పండితులు చెబుతున్న శాస్త్రాల ప్ర‌కారం ఈనెల 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీల్లో వివాహాలకు గృహప్రవేశాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అన్ని తేదీల్లో వివాహాలకు మరింత ప్రాముఖ్యంగా.. 17, 18 తేదీలు ఉన్నాయట. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పెళ్లిళ్ల సందడి మొదలైపోయింది. పురోహితులు మొదలుకొని.. కళ్యాణ మండపాలు, పూల అలంకరణలు, షామియానలు, కేటరింగ్, బ్యూటీషన్స్ ఇలా వివాహానికి సంబంధించి ప్రతి ప్రొఫెషన్ లో బిజీబిజీగా వ్యాపారాలు మొదలైపోయాయి.

అలాగే పెళ్లిళ్లలో పనిచేసే వర్కర్లకు సైతం చేత నిండా పనిదొరుకుతుంది. దీంతో వారికి కూడా మంచి రోజులు వచ్చినట్లే. శ్రావణమాసం వచ్చిందంటే రెండు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొన్నట్లే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి తోడు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం ఎలా మరిన్ని పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి మంచిది కావడంతో.. పూలు, పూజ సామాగ్రి వ్యాపారులకు ఈ నెల మరింతగా లాభాలు తెచ్చిపెట్టనుంది.