మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తాజా మూవీ గేమ్ చేంజర్. శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగులో శంకర్ దర్శకత్వం వహిస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. తమిళ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు అందించిన కథతో శంకర్ ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని కనిపించనుంది.
తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కూడా ఫ్యాన్స్‌లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సింది. కానీ భారతీయుడు 2 కారణంగా చివరి స్కెడ్యూల్ కాస్త ఆలస్యమైంది. రాంచరణ్ సంబంధించిన ఓ వారం రోజుల షూట్ కొంతకాలం పెండింగ్లో పడింది. దీంతో గేమ్ చేంజర్ పనులు కాస్త ఆలస్యం అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా గేమ్ చేంజర్ డబ్బింగ్ పనులను చేశారు మేకర్స్. తాజాగా డబ్బింగ్ పనుల పూజ కార్యక్రమాలను ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆరంభించారు. దీనికి సంబంధించిన ఫొటోస్‌ను నిర్మాణ సంస్థ.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది.
ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ రీ స్టార్ట్ కానుందట. మరోవైపు గేమ్ చేంజర్ ఎడిటింగ్ పనులు కూడా చెన్నైలో మొదలుపెట్టే ప్లాన్‌లో ఉన్నారట డైరెక్టర్ శంకర్. ఇక ఆర్‌ఆర్ఆర్ తర్వాత వస్తున్న చరణ్ సోలో సినిమా కావడంతో.. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్లో ప్లాన్ చేయనున్నారట మేకర్స్. దాదాపు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. డిసెంబర్ 20న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.