పవన్ కళ్యాణ్ తో ఒకే ఒక్క ఫోటో ఇప్పించమంటూ మెగా డాటర్ ను బతిమిలాడుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ఇండస్ట్రీలోనే ఎంతోమంది స్టార్ హీరోలు ఫేవ‌రెట్ హీరోగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో వారు పలు వేదికలపై అఫీషియల్‌గా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఏపీ ఎలక్షన్స్‌లో ఏకంగా 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొంది భారీ విజయాన్ని చేజక్కించుకున్నాడు పవర్ స్టార్. ఈ క్రమంలో కూటమిలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం హోదా దక్కింది.

Niharika - Pawan Kalyan : నిహారిక ఫోన్‌లో పవన్ కళ్యాణ్ ఫోన్ నంబర్ ఏమని సేవ్  చేసి ఉంటుందో తెలుసా? | Niharika konidela says interesting things about pawan  kalyan-10TV Telugu

 

దీంతో ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, డైరెక్టర్లు పవన్ కు అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే. చాలా మంది స్వయంగా పవర్ స్టార్ ను కలిసి మరీ విషెస్ తెలియజేశారు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్ పవన్ కళ్యాణ్‌తో సెల్ఫీ లేదా ఫోటో ఇప్పించమని మెగా డాక్టర్ నిహారికను స్పెషల్గా రిక్వెస్ట్ చేసిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.. ఆమె పూర్ణ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూనే.. ఓ పక్కన టీవీ షోలకు జడ్జ్ గాను వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో తాజాగా అదే షోకు నిహారిక కూడా గెస్ట్ గా వెళ్ళింది.

ఇక ఇందులో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై పిల్లలు ఓ మంచి స్కిట్ వేసి చూపించారు. ప్రస్తుతం ఈ స్కిట్‌ యూట్యూబ్‌లో తెగ వైర‌ల్‌గా మారింది. ఈ క్రమంలో పిల్లల స్కిట్ పూర్తి అయిన వెంటనే పూర్ణ.. పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే మొదటి నుంచి చాలా ఇష్టం. ప్లీజ్ నిహారిక ఒక్కసారి ఎప్పుడైనా నాకు ఆయనతో ఒక్క ఫోటో లేదా సెల్ఫీ ఇప్పించు అని రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం పూర్ణ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. వీటిని విన్న పవన్ ఫ్యాన్స్ పూర్ణ మాటలకు ఫుల్ ఖుషి అవుతున్నారు. పవర్ స్టార్ రేంజ్ అంటే ఇలాగే ఉంటుంది అంటూ.. అది మా పవన్ అన్న క్రేజ్ అంటూ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.