సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. మొదట నువ్విలా సినిమాలో చిన్న పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ.. అనంతరం హీరోగా మారి ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. మొదట పలు సినిమాల్లో నటించి మంచి సక్సెస్ అందుకున్న విజయ్.. తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ సాధించాలని ఆరాటంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాకపోవడంతో పాన్ ఇండియా లెవెల్‌లో డీలా పడిన విజయ్.. ఏమాత్రం తడబడలేదు.
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా భారీ అవకాశాలను దక్కించుకుంటూ సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా షూట్‌లలో బిజీగా గడుపుతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో విజయ్‌కు సంబంధించిన వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ తోపాటు తన తమ్ముడు ఆనంద దేవరకొండ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నా.. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ.. విజయ్ దేవరకొండ తన తల్లితో కలిసి ఓ సినిమాలో నటించాడు. అయితే విషయం చాలామంది గుర్తుపట్టకపోవచ్చు.
విజయ్ దేవరకొండ.. తల్లి మాధవి దేవరకొండ తో కలిసి హీరోగా నటించిన ఈ సినిమాల్లో ఆయన తల్లి.. కాలేజ్ లెక్చర్ పాత్రను పోషించింది. అయితే సినిమాలో ఆమె పాత్ర చాలా తక్కువ నడివి ఉన్న నేపథ్యంలో ఎవరికీ ఇది అంతగా తెలిసి ఉండదు. ఇంతకీ వీరిద్దరూ కలిసి నటించిన ఆ సినిమా ఏంటో చెప్పలేదు కదా. అదే డియర్ కామ్రేడ్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ సినిమాల్లో విజయ్ దేవరకొండ తల్లి కూడా చిన్న పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. అయితే సినిమా ఊహించిన రేంజ్‌లో మాత్రం సక్సెస్ అందుకోలేదన్న సంగతి తెలిసిందే.