హీరో ఉపేంద్రతో ప్రేమ ఎఫైర్.. భర్తతో విడిపోవడానికి కారణం అదేనా..?

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది ప్రేమ. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. బెంగళూరులో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. 1995లో రిలీజ్ అయిన కన్నడ సవ్యసాచి మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఓం సినిమాలో నటించి మెప్పించింది. ఇక నటించిన రెండో సినిమాతోనే ఉత్తమ నటిగా కర్ణాటక రాష్ట్ర సిలంవ‌ర్ స్క్రీన్‌ అవార్డును దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. అతి తక్కువ సమయంలోనే కన్నడ స్టార్ బ్యూటీగా మారిపోయింది. ఇక 1996లో ధర్మచక్రం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. జగదేకవీరుడు, అత్త నీ కొడుకు జాగ్ర‌త్త‌, చెలికాడు, ఓంకారం, దేవి ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.

Actress Prema Opens Up About Her Relationship Rumours With Upendra: "They  Didn't Ask Me And..." - Filmibeat

తమిళ్, మలయాళ భాషల్లోను ప‌లు సినిమాలతో ఆకట్టుకుంది. ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2006లో ఆమె జీవన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లయిన తర్వాత కూడా మూడు సంవత్సరాల పాటు సినిమాల్లో కొనసాగిన ప్రేమ.. 2009లో ఇండస్ట్రీకి దూరమైంది. జీవన్, ప్రేమ కొంత‌కాలం హ్యాపీ లైఫ్ లీడ్ చేసిన ఈ జంట 2016లో మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి సోలో లైఫ్ లీడ్ చేస్తున్న ఈ అమ్మడు.. ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ జీవితంలో పెళ్లి ఎంతో ముఖ్యమైన ఘట్టమే.. కానీ అదే జీవితం కాదు అంటూ వివరించింది.

ఉన్నది ఒకటే లైఫ్. అందులో మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది నాకు ముఖ్యం. నా హ్యాపీనెస్ కోసం ఎలాంటి నిర్ణయం అయినా తీసేసుకుంటా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే లైఫ్ హ్యాపీ గా లేకపోవడం వల్లే భ‌ర్త‌త‌తో విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పకనే చెప్పేసింది. ఇక గతంలో కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఉపేంద్రతో ఆమెకి ఎఫైర్ ఉన్నట్లు వార్తలపై స్పందిన ఈ అమ్మ‌డు.. అస‌లు ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు.. క‌ల‌వ‌లేదు.. అలాంటిది మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ రాసేసారని వివరించింది. ఇక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మంచి, చెడు రెండు ఉంటాయి. ఎన్నో విమర్శలున్న ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని అసలు పట్టించుకోకూడదు అంటూ చెప్పుకొచ్చింది.