నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తాతకు తగ్గ మనవడిగా, స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుతున్న ఈయనకు.. ఇప్పటికే రెండు మూడు నిక్ నేమ్స్, బిరుదులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఉన్న నిక్ నేమ్స్ లో ఒక్క పేరు పెట్టి పిలిస్తే మాత్రం కోపం నషాలానికి అంటేస్తుందట. నోటికి వచ్చినట్లు తిట్టేస్తాడట. ఇంతకీ ఆ నిక్‌నేమ్ ఏంటి.. అసలు మ్యాటర్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్లో దాదాపు అందరూ హీరోస్‌కి నిక్‌నేమ్స్ ఉంటాయి. అల్లు అర్జున్‌కు బన్నీ, ప్రభాస్‌కు డార్లింగ్, రామ్ చరణ్ కు చెర్రీ, బాలకృష్ణకు బాలయ్య, చిరంజీవికి చిరు ఇలా నిక్ నేమ్స్ ఉన్నట్లే.. జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా ఎన్నో నిక్ నేమ్స్ ఉన్నాయి.
హరికృష్ణ కొడుకు అయిన ఎన్టీఆర్ తన తండ్రి అయిన సీనియర్ ఎన్టీఆర్ పేరునే పెట్టారు. అయితే ఈ పేరు విషయంలోను.. ఎన్నో వివాదాలు జరిగాయని.. నందమూరి కుటుంబ సభ్యులకు అన్నగారు పేరు జూనియర్ ఎన్టీఆర్ కు పెట్టడం ఇష్టం లేదని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఓసారి హరికృష్ణ ఓ ఈవెంట్లో మాట్లాడుతూ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్‌ను చూడాలని ఇంటికి పిలిపించుకున్న నాన్నగారు స్వయంగా తనను చూసి ఇతను నా ఆంశా నా పేరు పెట్టాలి అని తారక రామారావుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్చారని క్లారిటీ ఇచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌ను రాజమౌళితో పాటు ఇండస్ట్రీలో చాలామంది తారక్ అని నిక్ నేమ్‌తో సంబోధిస్తూ ఉంటారు.
ఆయనకు యంగ్ టైగర్ అనే బిరుదు కూడా ఉంది. అయితే ఎన్టీఆర్‌ని బుడ్డ ఎన్టీఆర్ అని మొదట్లో కొంతమంది పిలిచేవారు. ఎన్టీఆర్‌కు అలా పిలిస్తే అసలు నచ్చదట. హైట్ రిత్యా కావాలనే అలా నీకు నేమ్ పెట్టారు. అయితే ఆ పేరు ఎన్టీఆర్‌కు అసలు నచ్చదట.. దీనిపై చిరాకు వచ్చిన ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య సినిమాలో ఇన్ డైరెక్ట్ గా ఓ డైలాగ్ రూపంలో అలా పిలిచే వారందరికీ వార్నింగ్ ఇచ్చారని టాక్. ఆ డైలాగ్ రూపంలో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ప్రతివాడు బుడ్డోడు బుడ్డోడు అంటే బుట్టలు తీసి కొడతా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అలా పిలవాలంటే అర్హత ఉండాలి. లేదా నా అభిమానై ఉండాలి అంటూ తారక్ చెప్పిన డైలాగ్ అప్పట్లో తెగ వైరల్‌గా మారింది. ఆ డైలాగు ఎన్టీఆర్ కావాలనే ఎవరినో ఉద్దేశించి అన్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.