సినీ ఇండస్ట్రీలో ఒక్క చిన్న అవకాశం దొరికితే చాలు నటనలో సత్తా చాటుకుని స్టార్ హీరోస్గా మారిపోదామని ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు అవకాశం వస్తే ఖచ్చితంగా వెండి తెరపై బీభత్సం సృష్టిస్తారు. కాగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే కచ్చితంగా బ్యాగ్రౌండ్ ఉండాలని అప్పుడే రాణించగలుగుతామని భావించేవారు ఉన్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కేవలం టాలెంట్ తో తమ సత్తా చాటి స్టార్ హీరోలుగా హీరోయిన్గా ఎదిగిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మరోవైపు వీళ్ళు పెద్ద పెద్ద సినిమాల్లో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుని ఫేమస్ అయిపోతున్నారు.
అయితే కొంతమంది మాత్రం చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలను దక్కించుకుని ఆ సినిమాల ద్వారా పేరు సంపాదించి.. పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఈ కుర్రాడు కూడా అదే కోవకు చెందుతాడు. ఇంతకీ ఈ యంగ్ హీరో ఎవరో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రెండు రకాలుగా సినిమాలు బస్తున్నాయి. భారీ బడ్జెట్లో పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు.. మరోవైపు లో బడ్జెట్ లో సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల కాలంలో కంటెంట్ ఉండడంతో చిన్న సినిమాలు కూడా భారీ క్రేజ్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా మొదట ఓటీటీలో రిలీజై.. తర్వాత వెండితెరపైకి వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆ సినిమాలో నటించిన సెలబ్రిటీలు కూడా భారీ పాపులారిటి దక్కించుకున్నారు. అలాంటి నటలలో యంగ్ హీరో కిరాణ్ అబ్బవరం ఒక్కడు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి మెప్పించిన ఈయన.. తర్వాత సినీ ఇండస్ట్రీలో హీరోగా అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే స్టార్ హీరోగా ఎదగలేకపోయినా నేటి యువతకు ఐకాన్ గ నిలిచాడు.
బాలీవుడ్ హీరో లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈయన ఏపీ, కడప జిల్లా రాయచోటిలో జులై 15న జన్మించాడు. చదువు పూర్తై ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న టైంలో రాజవారు.. రాణివారు.. సినిమా అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా.. ఈ సినిమా తర్వాత 2021లో రిలీజ్ అయిన ఎస్ఆర్ కళ్యాణమండపంతో కిరణ్ కు బ్రేక్ వచ్చింది. తర్వాత వినరో భాగ్యం విష్ణు కథ, సమ్మతమే, మీటర్, రూల్స్ రంజన్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు.
ఇక ప్రస్తుతం కిరణ్ అభవరం క అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ జులై 15న రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేశారు. ఈ సినిమా రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది. వచ్చే సెప్టెంబర్‌లో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషలను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో కిరాణా అబ్బవరం చిన్ననాటి ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.