సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచం పై ఆసక్తితో అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రానిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. నటన అంటే ప్రాణంగా ప్రేమించి అదే వారి కెరీర్‌గా ముందుకు కొనసాగుతున్న వారు ఎన్నో సందర్భాల్లో పాత్రలో ఒదిగిపోయి జీవించడంతో ప్రేక్షకుల ప్రశంసలు అందించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే పాత్ర డిమాండ్ చేసినప్పుడు వారు కూడా ఆ పాత్రలో మోల్డ్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ పాత్రల కోసం బాడీ లుక్స్ ను కూడా మార్చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దేవుళ్లకు సంబంధించిన సినిమాలు చేసేటప్పుడు నాన్ వెజ్ మానేసి నిష్ఠగా సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా తమ సినిమాల కోసం నాన్ వెజ్ మానేసి నటించిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం.
సీనియర్ ఎన్టీఆర్:
పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా నిలచిన ఎన్టీఆర్.. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఎలా ఎన్నో పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాగా దేవుళ్ళ పాత్రలో నటించే ప్రతిసారి ఎన్టీఆర్ ఎంతో నిష్టగా ఉండేవారట. నాన్ వెజ్‌కు దూరంగా ఉండి ఆ పాత్రలో నటించే వారట.
నాగార్జున:
నాగార్జున నటించిన షిరిడి సాయి కథ సినిమా టాలీవుడ్‌లో ఎలాంటి పాపులారిటి దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో నాగార్జున సాయిబాబా పాత్రను పోషించాడు. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా.. షూట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు నాగార్జున అసలు మాంసాహారాన్ని ముట్టుకోలేదట.
అల్లు అర్జున్ :
హరిష్ శంకర్ డైరెక్షన్లో అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ బ్రాహ్మణ పాత్రలో మెప్పించాడు. ఇక బ్రాహ్మణులను గౌరవించాలనే ఉద్దేశ్యంతో.. బ్రహ్మణులు నాన్‌బేజ్ తినరు కనుక.. ఆ క్యారెక్టర్‌లో నటించిన సమయం అంత ఆయన కూడా నాన్ వెజ్ ముట్టలేదట.
పవన్ కళ్యాణ్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ బ్రో. ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోకపోయినా.. పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్.. దేవుడు పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా షూట్ పూర్తయ్య వరకు పవన్ కళ్యాణ్ మాంసాహారానికి దూరంగా ఉన్నారట.