ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా మూవీ పుష్ప2. నేషనల్ క్రైస్ట్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కోసం లక్షలాదిమంది అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ పై పాన్ ఇండియా లెవెల్ లో అంచనాలు పెరిగాయి. ఇక పుష్ప సినిమాలో తన మ్యానరిజంతో పుష్ప రాజ్‌గా బాలీవుడ్ లోను భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.
ఈ క్రమంలో పుష్ప 2 కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ ఎర్పడింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, గ్లింప్స్ కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక మొదట ఆగస్టు 15 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 6కు పోస్ట్‌పోన్ చేసినట్లు అనౌన్స్ చేశారు.
కొన్ని సీన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయని.. ఈ కారణంగానే రిలీజ్ డేట్ ను మారుస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అదిరిపోయే అప్డేట్ నెటింట వైరల్ గా మారింది. తుది దశకు చేరుకున్న ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ ఈ వారంలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. హైదరాబాద్ శివార్లలో ఓ ప్రముఖ స్టూడియోలో కొన్ని యాక్షన్స్ సన్నివేశాలను షూట్ చేయనున్నారట మేకర్స్. ఇక ఈ సినిమాకు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.