ప్రభాస్ రాజాసాబ్ స్టోరీ లీక్.. క‌థ కాపీ అంటూ స్టార్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్..?

పాన్‌ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి తో సూపర్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్‌ డైరెక్షన్ ఈ సినిమా రూ.550 కోట్లు బడ్జెట్లో దూసుకుపోతుంది. కాగా ప్రభాస్, మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమాను కూడా నటిస్తున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ ఇప్పటికే 50% పూర్తయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, మారుతి టీం వర్క్ సంస్థ లు ఈ సినిమాలో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో మూవీ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఎంతో పగడ్బందీగా సినిమాకు సంబంధించిన చిన్న‌ విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా సినిమాకు సంబంధించిన స్టోరీ ఇదే అంటూ ఐఎమ్‌డీబి పేజ్ లో కొత్త అప్డేట్ వైరల్ గా మారింది. అదేంటంటే ఓ జంట.. విధిని ఎదిరించి నెగటివ్ ఫోర్స్‌ను దాటుకొని ఎలా కలిశారు అనేది ఈ సినిమా లైన్ గా ఐఎన్‌డీబిలో వివరించారు. ఇదే ఈ సినిమా స్టోరీ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ట్విట్టర్ పేజ్ పోస్ట్ ను షేర్ చేసింది. దీనికి మూవీ స‌హ‌ నిర్మాత ఎస్‌కేఎన్ స్పందిస్తూ.. రాదే శ్యామ్ సినిమాకు సంబంధించిన లైన్ ని ఈ సినిమాకు ఐఎన్‌డీబిలో టీం పొరపాటున కాపీ చేసినట్టున్నారు అంటూ వివరించాడు.

Producer SKN Hilarious Super Speech about Raja Saab Movie @ True Lover  Movie Pre Release Press Meet

అయితే స్టోరీ లైన్ వేరే ఉంది అని ఇన్ డైరెక్ట్ గా ఆయన చెప్పుకొచ్చాడు. నిజానికి రాజాసాబ్‌ ఐఎన్‌డీబిలో అసలు ఇలాంటి లైనే లేదు. వేరే విధంగా సినిమాను వర్ణించారు. అయితే రాజాసాబ్‌ మాత్రం.. సినిమాకు చెబుతున్న విధిని, నెగిటివ్ ఫోర్స్ ను ఎదిరించి జంట ఏకమయ్యే లైన్ లేదనే విషయం క్లారిటీ ఇచ్చినట్లు అయింది. మరి ఒరిజినల్ లైన్ ఏమై ఉంటుంది.. అనేది మేకర్స్ గోప్యంగానే ఉంచుతున్నారు. సినిమా రిలీజ్ అయితే గాని అసలు స్టోరీ ఏంటో.. బయటకు రాని విధంగా పగడ్‌బందిగా ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా రిలీజై ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.