టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాలుకు దూరమైంది. అయితే కోలీవుడ్, బాలీవు్‌లో మాత్రం వరుస అవకాశాలను దక్కించుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఇక ప్రస్తుతం రకుల్ భారతీయుడు 2 సినిమాతో బిజీగా గడుపుతుంది. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
ఇందులో రకుల్ ప్రీత్‌తో పాటు సిద్ధార్థ , కాజల్, ఎస్ జె సూర్య లాంటి ప్రధాన తారాగణం అంతా కీలకపాత్రలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దీంతో ప్రమోషన్స్ లో జోరు పెంచిన మూవీ టీం.. సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను ఆడియన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ తన ఇన్స్టా వేదికగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ ఏర్పాటు చేసింది. ఇందులో అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.
ఈ ముద్దుగుమ్మ తన సినిమా, పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అని ప్రశ్నించగా అమేజింగ్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తన సక్సెస్ మంత్ర గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా నేను కేవలం నా లైఫ్, జాబ్, ఫ్యాన్స్ పైన మాత్రమే ఫోకస్ చేస్తా. ముఖ్యంగా నెగెటివిటీకి చాలా దూరంగా ఉంటా. ఎవరు నా గురించి ఆలోచిస్తున్నా.. అసలు పట్టించుకోను. నా లిమిట్స్ లో నేను ఉంటా. అదే నా సక్సెస్ సీక్రెట్.. అదే నా స్ట్రెంత్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి.