బుక్ మై షో లో ‘ కల్కి ‘ ఊచకోత.. 8 రోజుల్లో ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయో తెలుసా..?!

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన కల్కి 2898 ఎడి మోస్ట్ ఎవైటెడ్‌ సినిమాగా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు దాదాపు నాలుగు రోజుల ముందే ప్రీబుకింగ్స్ ను బుక్ మై షో యాప్ ద్వారా ఓపెన్ చేశారు మేకర్స్. ఇక ఓపెనింగ్స్ లోనే రికార్డులు సృష్టించిన ఈ సినిమా రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో అప్ప‌టి నుంచి టికెట్స్ అమ్మకాలు మ‌రింత భారీ లెవెల్ లో పెరిగిపోయాయి.

ఈ క్రమంలో జూన్ 23 నుంచి జూన్ 30వ తారీకు వరకు బుక్ మై షో బుక్ అయిన కల్కి టికెట్ల వివరాలు ఒకసారి చూద్దాం. జూన్ 23న కల్కి బుకింగ్స్ ఓపెన్ చేయగా బుక్ మై షో తో మొదటి రోజు 340 కే టికెట్లు బుక్ అయ్యాయి. అలాగే 24వ తేదీన 329 కే టికెట్లు, 25వ తేదీన 447 కే టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక జూన్ 26వ తేదీన ఏకంగా 645 కే టికెట్లను కొనుగోలు చేశారు అభిమానులు. ఇలా రిలీజ్ కు ముందే రికార్డ్ స్థాయితో 1761 నేల టికెట్లు బుక్ మై షో ద్వారా అమ్ముడుపోయాయి.

Upcoming Telugu Movies 2024 | Hindi Movies Releasing This Week in Kalanaur  - BookMyShow

ఇక రిలీజ్ డేట్ జూన్ 27న కల్కి కి ఏకంగా 1.12 మిలియన్ టికెట్లు హార్ట్ కేకుల్లా సేల్ అయ్యాయి. జూన్ 28న 1.17 మిలియన్ టికెట్లు, జూన్ 29న 1.28 మిలియన్ టికెట్లు, జూన్ 30న 1.12 మిలియన్ టికెట్లు సేల్ అయ్యాయి. ఇలా జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు బుక్ మై షో లో మొత్తంగా కల్కి సినిమాకు 6.45 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులుపండ‌గ చేసుకుంటున్నారు. ఇది ప్రభాస్ రాజు స్టామినా, ఇది మా డార్లింగ్ రేంజ్ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.