జక్కన్నకు జలక్ ఇవ్వబోతున్న తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒకసారి గా ఇంత షాక్ ఇచ్చాడు ఏంటి..?!

టాలీవుడ్ ప్రేక్షకులకు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్ట‌ర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు జ‌క్క‌న‌. ఇక రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి కూడా టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు తెలుసు. ఇక ఈయన ఓ అద్బుత‌మైన తైట‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. అయితే ర‌చ‌యిత‌గానే కాకుండా కొన్ని సినిమాల‌కు కానీ దర్శకుడిగా కూడా వ్య‌వ‌హ‌రించాడు విజ‌యేంద్ర‌ ప్రసాద్.

SS Rajamouli

ఆయ‌న దర్శకత్వంలో శ్రీ కృష్ణ 2006, రాజన్న, శ్రీవళ్ళి లాంటి సినిమాలను తెరకెక్కాయి.ఇప్పుడు మ‌ళ్ళీ విజ‌యేంద్ర ప్ర‌సాద్ మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.450 కోట్లు అని స‌మాచారం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై సినిమా చేయడానికి విజయేంద్ర ప్రసాద్ అంతా సిధ్ధం చేస్తున్నాడ‌ట. 2025 సెప్టెంబర్‌కు ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ సంస్థ గొప్పతనం గురించి ఈ తరానికి తెలిసేలా ఒక భారీ మూవీ చేయాలని మంచి ప్లాన్‌లో ఉన్నాడ‌ట విజ‌యేంద్ర ప్ర‌సాద్.

Screenwriter Vijayendra Prasad all praise for RSS, to direct film, web  series soon

కాగా విజయేంద్ర ప్రసాద్‌కు బీజేపీ అన్నా, ఆర్ఎస్ఎస్ అన్నా ఎంతో అభిమానం అన్న సంగ‌తి తెలిసిందే.బీజేపీ ప్రభుత్వం 2022 జులైలో ఆయనను రాజ్యసభ స‌భ్యుడిగా కూడా నామినేట్ చేసింది.ఈ క్రమంలో ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఆర్ఎస్ఎస్ పై సినిమా చేయడానికి సన్నాభాలు చేస్తున్నాడంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.పైగా ఈ సినిమా బడ్జెట్ రూ.400 నుంచి రూ.450 కోట్లు అనే వార్త మరింత సంచలనంగా మారింది.ఈ సినిమా కోసం తెలుగు, హిందీ తో పాటు మ‌రి కొన్ని భాషలకు చెందిన పలువురు స్టార్‌ నటీనటులను రంగంలోకి దింపనున్నారని సమాచారం. ప్ర‌స్తుతం ఈ న్యూస్ నెటింట‌ హాట్ టాపిక్ గా మారింది.