భారీ పాన్ ఇండియన్ కథతో మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే పూనకాలే..!!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్ప‌టినుంచో ప‌లు వార్తలు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎంట్రీ కచ్చితంగా ఎప్పుడు ఉంటుంది అనేదానిపై మాత్రం ఇప్పటివరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించి మరో న్యూస్ నెటింట‌ వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్లు.. సోషల్ మీడియాలోనే కాదు ఎన్నో అఫీషియల్ పేజీల్లో కూడా వార్తలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. దానికి తగ్గట్టు మోక్షజ్ఞ సూపర్ స్టైలిష్ లుక్ లో ఉన్న తాజా పిక్ ఒకటి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ పిక్‌ను నందమూరి అభిమానులు మరింత వైరల్ చేస్తూ.. నందమూరి నట‌సింహం వారసుడు వస్తున్నాడు అంటూ.. మా బాలయ్య వారసుడు వస్తున్నాడు అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ వార్తలు నిజమే అంటూ తెలుస్తుంది. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటినుంచో నందమూరి ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా వాళ్ళ నిరీక్షణకు తెరపడినట్లు అనిపిస్తోంది. మోక్షజ్ఞ.. పాన్ ఇండియా లెవెల్ స్టోరీలో హీరోగా నటించబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.

This Young Director Prasanth Varma Turns Out To Be A Champ

ఇక‌ ఆ మూవీ డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ లో పూనకాలు మొదలవుతాయి. ఆ డైరెక్టర్ ఎవరో అనుకుంటున్నారా.. హనుమాన్ మూవీ తో ఇండియాను కుదిపేసిన సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మోక్షజ్ఞ కోసం బాలయ్యకు ఓ స్టోరీ లైను వినిపించాడట ప్రశాంత్ వర్మ. ఇది కనుక కథగా మలిస్తే భారీ పాన్ ఇండియన్ సినిమాలా ఉండడం ఖాయం అంటూ చెబుతున్నారు. ఇక ప్రశాంత్ వర్మ చెప్పిన ఆ పాయింట్ అద్భుతంగా నచ్చేయడంతో బాలకృష్ణ వెంటనే క‌థ‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక బాలయ్య నుంచి అఫీషియల్ గా ప్రకటన రావ‌డ‌మే అల‌స్యం.. నందమూరి అభిమానులు పండగచేసుకుంటారు.