టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మయాసైటిస్ ట్రీట్మెంట్ అంటూ సినిమాకు ఎడాది కాలంగా బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏడాది దాటుతున్న ఇప్పటికీ అమ్మడు ఏ సినిమాకు సైన్ చేయకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అమ్మడు సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్లు నెటింట వైరల్ గా మారాయి. గతంలో సమంత బ్రేక్ ముందు వరుణ్ దావన్‌తో భాలీవుడ్ సిరీస్ సెటాడెల్‌లో నటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా అమెజాన్ ఓటీటీ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే సమంత కొద్ది రోజుల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా.. నా బంగారు తల్లి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది.
ఈ సినిమాను తన సొంత ప్రొడక్షన్ హౌస్ లో నిర్మిస్తుంది. కాగా తాజాగా ఈ అమ్మడు మరో స్టార్ హీరోతో జతకట్టబోతుందని.. వాళ్ళు ఇద్దరిదీ ఇప్పటికే మంచి హిట్ పేయిర్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరోకాదు తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్. గతంలో వీరిద్దరూ కలిసి మూడు సినిమాల్లో నటించగా.. మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరిది హిట్ ఫెయిర్ అనే ముద్ర పడిపోయింది. ఇక ఈ జంట మరోసారి వెండితెరపై రొమాన్స్ చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ 69 సినిమాలో సమంత హీరోయిన్గా ఫిక్స్ అయిందని.. తమిళ్ ఫిలిం సర్కిల్లో ప్రచారం జోరుగా సాగుతుంది.
దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ కి రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. తన చివరి సినిమా విజయ్ 69 కు భారీ లెవెల్లో సన్నాహాలు చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. డి.వి.వి. దానయ్య ప్రొడ్యూసర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో విజయ్ యువ రాజకీయ నాయకుడిగా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా సమంత ఫిక్స్ అయిందని.. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని టాక్ నడుస్తుంది. ఇక ఈ హీట్ పెయిర్ కాంబోలో మరో సినిమా వస్తే బాగుండని అభిమానులు ఎప్పటి నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందని తెలియడంతో.. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.