యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మా వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడది రిలీజ్ అయిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ప్రశాంత్ వర్మా సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ లెవెల్లో అంచనాలు పెరిగాయి. తను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమై ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఓ మాస్ హీరోతో యంగ్ డైరెక్టర్ త్వరలోనే సినిమా చేయబోతున్నాడు అంటూ నెటింట వార్తలు వైరల్ గా మారాయి.
ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ. ప్రశాంత్ వర్మ.. రవితేజ కోసం ఓ కథను రెడీ చేసుకున్నాడట. అన్ని కుదిరితే ఈ సినిమాను వచ్చే ఏడాదిలో మొదలుపెట్టేందుకు ప్రశాంత్ వర్మ సిద్ధంగా ఉన్నట్లు సినీ సర్కిల్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం ఆయన హనుమాన్ సినిమా సీక్వెల్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. అటు మాస్ మహారాజ్ రవితేజ కూడా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు.
దీంతో ఆయన ఓకే చేసిన ప్రాజెక్టులు అన్నీ పూర్తయిన వెంటనే ప్రశాంత్ వార్మతో సినిమాకు రెడీ అవుతాడని సమాచారం. మరి నిజంగా ఈ కాంబినేషన్ సినిమాస్ వస్తే మాత్రం ప్రేక్షకుల్లో రిలీజ్ కు ముందే మంచి అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే మేకర్స్ నుమచి లేదా ప్రశాంత్ వర్మా అఫీషియల్‌గా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే.