క‌ల్కి రివ్యూ ఇస్తూ ప్ర‌భాస్‌ను బావా అన్న మోహ‌న్ బాబు.. అలా పిల‌వ‌డం వెనుక ఇంత స్టోరీ ఉందా..!!

పాన్ ఇండియ‌న్‌ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడి.. అభిమానుల్లో భారీ అంచనాల మధ్య రిలీజై వారి అంచనాలకు తగ్గట్టుగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. గత మూడు రోజులుగా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా ప్రస్తుతంరూ.1000 కోట్ల రన్ వైపుగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఎందరో పాజిటివ్ రివ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అలా సినిమా చూసిన సెలబ్రెటీల రివ్యూలు.. సోషల్ మీడియా వేదికగా తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. ప్రభాస్ కల్కి సినిమాను చూసి ట్విట్టర్ వేదికగా తన రివ్యూ ఇచ్చాడు.

మూవీ టీం అందరికీ అభినందనలు తెలియజేశాడు. కొద్దిసేపటి క్రితమే కల్కి చూశా సినిమా అద్భుతం.. మహాద్భుతం అంటూ వివరించాడు. అలాగే ప్రభాస్ ను బావ అని సంబోధిస్తూ మా బావ ప్రభాస్‌కు, అమితాబచ్చన్, ప్రొడ్యూసర్ అశ్విని దత్త్, నాగ అశ్విన్‌లకు నా అభినందనలు అంటూ వివరించాడు. భారతదేశం గర్వించదగిన సినిమాను ప్రేక్షకులుగా అందించినందుకు ఆనందంగా ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ నెటింట‌ వైరల్ గా మారడంతో మోహన్ బాబు.. ప్రభాస్‌ను బావ అని ఎందుకు పిలిచాడా అనే చర్చ తెగ వైర‌ల్‌గా మారింది.

Bujjigadu

బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు త్రిష కు అన్నగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వీరిద్దరి మధ్యన మంచి బాండింగ్ ఏర్పడింది. ఇక ఆవ‌దులో చూపించిన వ‌ర‌స‌ల ప్ర‌కారం మోహన్ బాబుకు ప్రభాస్ బావ అవుతాడు అందుకే అలా సంబోధించాడు. ఇక ప్రస్తుతం మంచు మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా కొడుకు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్.. విష్ణు తో పాటు సినిమాలో ఎంతోమంది ప్రధాన తారాగణం కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటి వరకు కన్నప్ప నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకోవడమే కాదు యూట్యూబ్లో మిలియన్ న్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది.