రాజమౌళి-నాగ్‌ అశ్విన్‌కి మధ్య ఉన్న బిగ్ తేడా అదే?.. ‘కల్కి’లో విషయంలో జరిగిన మిస్టేక్‌ మీరు గమనించారా..?

ఏదైనా సినిమా హిట్ అయితే ఆ సినిమాలోని పాజిటివ్ యాంగిల్ కన్నా నెగిటివ్ యాంగిల్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ట్రోలర్స్. ప్రజెంట్ ఇప్పుడు కల్కి సినిమా విషయంలోనూ అదే జరుగుతుంది. పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన కల్కి సినిమాపై సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ప్రభాస్ నటించిన కల్కి సినిమాను చాలామంది జనాలు చూసి పొగిడేస్తున్నారు .

అయితే సినిమా చూసిన వాళ్ళల్లో కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు . మరీ ముఖ్యంగా నాగ్ అశ్వీన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి లకు కంపారిజన్ చేస్తూ దారుణంగా మాట్లాడుతున్నారు. కొందరు నెటిజన్స్ కల్కి సినిమాను నాగ్ అశ్వీన్ కంటే రాజమౌళిని బాగా తెరకెక్కిచుండేవాడు అని కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాదు రాజమౌళి – నాగ్ అశ్వీన్ ఇంచుమించుగా ఒకే విధంగా సినిమాలు తీస్తున్నారు అని ..కానీ రాజమౌళి తన సినిమాల ప్రమోషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా పకడ్బందీగా ముందుకు వెళుతూ వచ్చాడు అని ..

నాగ్ అశ్వీన్ మాత్రం సినిమాను తెరకెక్కించడంలో రాజమౌళిని ఫాలో అయిన ప్రమోషన్స్ విషయంలో మాత్రం రాజమౌళిని బీట్ చేయలేకపోయాడు అని .. అందుకే ఈ సినిమా కలెక్షన్స్ కొంచెం తగ్గాయి అని మాట్లాడుకుంటున్నారు ..ఇద్దరి మధ్య ఉన్న తేడా అదే అని అందుకే బాహుబలి సినిమా హిట్ అయిన రేంజ్ లో కల్కి సినిమా హిట్ అవ్వలేదు అని .. నిజానికి బాహుబలి సినిమా కాన్సెప్ట్ కన్నా కల్కి సినిమా కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా వెరైటీగా అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది అని ప్రమోషన్స్ నిర్వహించి ఉంటే సినిమా ఇంకొంచెం హిట్ అయి ఉండేది అని మాట్లాడుకుంటున్నారు..!!