గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ గా అలాంటి పని చేసిన యంగ్ హీరోయిన్.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్..!

ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్ చెప్పకుండా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ చాలామంది అదే తంతును ఫాలో అవుతున్నారు . అయితే కొంతమంది మాత్రం గ్రాండ్ గా పెళ్లి కోసం కోట్లకి కోట్లు తగలేస్తూ వస్తున్నారు. సంగీత్ – రిసెప్షన్ – మెహేంది అంటూ భారీ స్థాయిలో ఖర్చుపడుతున్నారు . అయితే ఇక్కడ ఓ హీరోయిన్ చేసిన పని మాత్రం అందరికీ షాకింగ్ గా ఉంది . చాలా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది .

ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు సంపాదించుకోవడానికి ఎంతో మంది హీరోయిన్స్ ట్రై చేస్తూ ఉంటారు . అయితే వాళ్లలో అందరికీ డిఫరెంట్ ఈ హీరోయిన్. పేరు మీరా నందన్. పేరుకి మలయాళ బ్యూటీ అయినా తెలుగులో కూడా కాస్తో కోస్తో తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకున్న ఈ బ్యూటీ రీసెంట్గా గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకుంది. యూకేకి చెందిన శ్రీజూ అనే వ్యక్తిని..కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది .

యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ..జై బో లో తెలంగాణా సినిమా తో బాగా పాపులారిటీ దక్కించుకుంది. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ పెళ్లి అంటే ఎంత హంగామా చేస్తున్నారో ..?ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసు. అలాంటిది ఈ హీరోయిన్ ఇంత సింపుల్గా పెళ్లి చేసుకోవడం ఫ్యాన్స్ కూడా ఊహించలేకపోతున్నారు . ప్రెసెంట్ ఆమె పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!