రాజమౌళి మహాభారతంలో ఆఫర్ వచ్చిన ప్రభాస్ నో చెప్పేసాడా.. కారణం అదేనా..?!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి.. మహాభారతం సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. ఈ సినిమాను కచ్చితంగా తెరకెక్కిస్తాను అంటూ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాజమౌళి డైరెక్షన్‌లో బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్.. మరోసారి ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది కల్కి తర్వాత సెట్స్ పైకి వస్తుందా.. అనే ప్రశ్నకు మాత్రం నో అనే సమాధాన‌మే అందుతుంది. రాజమౌళి సినిమాలో నటించడానికి ప్రభాస్ సిద్ధంగా లేడని వార్తలు నెటింట‌ తెగ వైరల్ అవుతున్నాయి. రాజమౌళితో సినిమా వద్దనుకోవడానికి కారణం ఏంటి వేరే సినిమాలతో బిజీగా ఉండడమా.. లేదంటే ఇంకేమైనా పని ఉందా.. కల్కి తర్వాత ప్రభాస్ చేయబోతున్న సినిమా ఏంటి.. అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Thank you Darling' SS Rajamouli thanks Prabhas after he congratulates RRR  director for his international win - India Today

అయితే రాజమౌళి తీసే మహాభారతంలో ప్రభాస్ నటించనున్నాడ‌ని చాలా కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ టాలీవుడ్ తాజా అప్డేట్ ప్రకారం రాజమౌళి సినిమాలో ప్రభాస్ నటించడం లేదట. ప్రభాస్‌తో రాజమౌళి మూడు సినిమాలు చేశాడు. మూడు బ్లాక్ బ‌స్టర్ సినిమాలే. మొదట చత్రఫ‌తి రిలీజ్ అయి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. తర్వాత చాలాకాలం గ్యాప్ తో వీరిద్దరి కాంబినేషన్‌లో బాహుబలి సిరీస్‌లు వచ్చి బ్లాక్ బ‌స్టర్లుగా ఇండియా లెవెల్ లో చరిత్ర సృష్టించాయి. అయినా ఇంతటి హిట్ కాంబినేషన్కు ప్రభాస్ నో చెప్పాడన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళితో సినిమా చేయను అని ప్రభాస్ చెప్పడానికి కారణం బాహుబలి సినిమా నట. బాహుబలి రెండు పార్ట్‌ల‌కు క‌టిపి దాదాపు 5ఏళ్లు పట్టిందని.. ఈ కారణంగానే ప్రభాస్ మరో సినిమాను ఆయన కాంబోలో నటించడానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది.

ఐదేళ్లు సినిమాకు తగ్గట్టు భారీ హిట్ అందించినా చాలా సమయం తీసుకుంటున్నాడనే ఉద్దేశంతోనే మహాభారతాన్ని ప్రభాస్ రిజెక్ట్ చేశాడు అంటూ తెలుస్తుంది. జ‌క్క‌న‌ ఆలోచనలో ఉన్న మహాభారతం సినిమాను.. పది పార్ట్‌లుగా తీయనున్నారని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి చేయడానికి ఎలా కాదన్నా పదేళ్ల సమయం పడుతుందట. అంటే రాజమౌళితో సినిమాకు ఓకే చెబితే పదేళ్లు ప్రభాస్ మరే సినిమా చేయకూడదు. దీంతో ప్రభాస్ మరోసారి రాజమౌళి సినిమాను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేడ‌ని తెలుస్తుంది. అయితే తాజాగా వచ్చిన కల్కి సినిమాలో రాజమౌళి గెస్ట్ రోల్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన ఎంట్రీ డైలాగ్‌లో ప్రభాస్ సమయం ఇస్తే ఐదేళ్లు చేసావ్ అనే డైలాగ్ వేయగా.. రాజమౌళి ఈసారి దొరికితే 10 ఏళ్ల తొక్కేస్తా అనే డైలాగ్ చెప్తాడు. దీన్ని ప్రస్తుతం ఫ్యాన్స్ గట్టిగా వైరల్ చేస్తూ.. ఇది మహాభారతం కోసం ప్రభాస్ నుంచి రాజమాళి తీసుకోనున్న టైం అని ఇన్ డైరెక్ట్ గా హిట్ ఇస్తున్నాడు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.