“చెప్పు చూపిస్తూ అలాంటి కామెంట్స్ చేసిన నాగ్ అశ్విన్”.. వార్నింగ్ ఇస్తున్నాడా..?

నాగ్ అశ్వీన్.. ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది . దానికి కారణం కల్కి సినిమా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మహానటి సినిమాతో స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి యాడ్ అయిపోయిన నాగ్ అశ్వీన్.. ఎంతో డెడికేషన్ తో కేర్ఫుల్గా కష్టపడి తెరకెక్కించిన సినిమా కల్కి . మన పురాణాలను బేస్ చేసుకుని ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే విషయాన్ని జనాలకు కళ్ళకు కట్టినట్లు తెరకెక్కించి చూపించాడు నాగ్ అశ్వీన్. ప్రభాస్ హీరోగా దిశా పటాన్ని – దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది .

సినిమాపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . ప్రభాస్ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంది అని .. కొన్ని కొన్ని సీన్స్ నాగ్ అశ్వీన్ కంటే రాజమౌళి ఇంకా బాగా తెరకెక్కించేవాడు అని కొందరు నెగిటివ్గా స్పందిస్తున్నారు . అయితే అలాంటి కామెంట్స్ చూశాడో..? లేకపోతే తన కష్టాన్ని చెప్పాలి అనుకున్నాడో..? నాగ్ అశ్విన్ సింబాలిక్ గా ఒక పోస్ట్ పెట్టి జనాల అటెన్షన్ గ్రాబ్ చేశాడు. సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకున్న మూమెంట్లో..

నాగ్ అశ్వీన్ తన చెప్పులను ఫోటో పెట్టాడు . ఈ సినిమా కోసం నేను చెప్పులు అరిగిపోయేలా వర్క్ చేశాను అని చెప్పడానికో.. లేకపోతే ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో.. వాళ్ళు కనీసం ఈ చెప్పులను చూసి అయినా ట్రోలింగ్ ఆపండి ..తన బాధను వినండి అనే అర్థం వచ్చేలా పెట్టాడో తెలియదు కానీ ..నాగ్ అశ్వీన్ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి నాగ్ అశ్వీన్ కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు . ఇప్పుడు రాజమౌళి పక్కన చైర్ వేసుకుని కూర్చునే స్థాయికి ఎదిగిపోయాడు .