త‌న పేరు మార్చుకున్న ప్ర‌బాస్‌.. ఇక పై డార్లింగ్‌ను అలానే పిల‌వాల‌ట‌..

గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులంతా ఎంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా కల్కి నేడు గ్రాండ్ లెవెల్లో ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చింది. దీంతో ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అందరూ థియేటర్లో బారులు తీరి మరి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కల్కి మొదటి షో తోనే హిట్ టాక్ అందుకోవడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇప్పటికే ఇండియాలో కల్కి మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు పడిపోవడంతో పబ్లిక్ రివ్యూ నుంచి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ పాజిటివ్ టాక్ లు వినిపిస్తున్నాయి.

Sri Prabhas: ప్రభాస్ కాదు.. ఇక నుంచి 'శ్రీ' ప్రభాస్! - NTV Telugu

పాన్ ఇండియ‌న్ స్టార్‌హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్‌ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో నార్త్ స్టార్ సెలబ్రిటీలు అమితాబచ్చన్, దీపిక పదుకొనే, దిశ పట్టానితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్, శోభన కీలక పాత్రలో నటించారు. భారీ అంచ‌నాల‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. మైథ‌లాజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సెట్స్‌ పై ఉన్నప్పటి నుంచి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొద‌ల‌య్య‌యి. ఇక మ‌ధ్య‌లో రిలీజైన పోస్టర్, ట్రైలర్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Kalki 2898 AD| ప్ర‌భాస్ కోసం క‌దిలి వ‌స్తున్న చంద్ర‌బాబు, ప‌వ‌న్..  అభిమానుల‌కి క‌న్నుల పండ‌గే..! | vidhaatha.com

అయితే సినిమాతో ప్రభాస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. గతంలో రెబల్ స్టార్ అనే టాక్ తో దూసుకుపోయిన ప్రభాస్.. తాజాగా తన పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు రిలీజ్ అయిన కల్కి ఇంట్రడక్షన్ లోనూ రెబల్ స్టార్ అనే టైటిల్ కి బదులుగా.. ‘ శ్రీ ప్రభాస్ ‘ అనే పేరును వేశారు. ఇక ప్రభాస్‌ను మొద‌టి నుంచి ఫ్యాన్స్ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో ప్రభాస్ తన పేరును శ్రీ ప్రభాస్ అని మార్చుకోవడం నెట్టింట వైరల్ గా మారింది. ఇక చివరిగా సలార్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రభాస్.. ఈ సినిమాతో మరోసారి రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమంటూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.