పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27(నిన్న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ సినిమా కంటెంట్, విజువల్స్, వి ఎఫ్ ఎక్స్, డైరెక్షన్ పరంగా ఆడియన్స్ను భారీ లెవెల్ లో ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమాపై, నాగ్ అశ్విని పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. భారీ బడ్జెట్, స్టార్ నటినటులతో, అదిరిపోయే యాక్షన్స్ సీన్స్, మహాభారతం విజువల్స్ అన్ని కూడా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. ఇక ఇందులో ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే ప్రతి సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. పురాణాలు, కలియుగంతం, కల్కికి అవుతారం మధ్య లింక్ పెట్టి సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రప్తో సినిమా తెరకెక్కించాడు నాగ్ అశ్విన్.
ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ను చూసి ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. ఏమాత్రం హాలీవుడ్ సినిమాలకు తక్కువ కాదంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా.. మొదటి రోజు రూ.200 కోట్లకు పైగా కలెక్ట్ చేయవచ్చని అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఇక తాజాగా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా కల్కి 2898 ఏడి.. భారతీయ సినిమాల్లో మూడవ అతిపెద్ద ఓపెనింగ్ ను దక్కించుకొని బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. ఇండస్ట్రీ ట్రాకర్ సిక్నిల్క్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. కల్కి భారతదేశంలో రూ.95 కోట్ల వరకు వసూళ్లను కొల్లగొట్టిందని తెలుస్తోంది.
గ్రాస్ కలెక్షన్ల ప్రకారం రూ.118 కోట్లు అని సమాచారం. అలాగే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.180 కోట్ల కలెక్షన్లను సాధించింది అత్యధిక వసూలు రాబట్టిన మూడో సినిమాగా కల్కి ప్రస్తుతం దూసుకుపోతుంది. ఇప్పటివరకు భారతదేశంలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ ఫస్ట్ డే రూ.223 కోట్ల కలెక్షన్లను రాబట్టి.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మొట్టమొదటి భారతీయ ఓపెనర్ గా రికార్డ్స్ సృష్టించింది. ఇప్పటికే అదే కంటిన్యూ అవుతుంది. తర్వాత స్థానంలో బాహుబలి 2 ఫస్ట్ డే రూ.217 కోట్ల వసూలను దక్కించుకుంది. ఇక ఇప్పుడు కల్కి 2898 ఏడి రూ.180 కోట్ల కలెక్షన్లను రాబట్టి మూడో స్థానంలో దూసుకుపోతుంది. ఇక ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డ్ లు బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి.