ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడు అంటూ ఆసక్తిగా ఎదురు చూసిన మూమెంట్ రానే వచ్చింది. టాలీవుడ్ రెబల్ స్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించినా కల్కి 2898 ఏడి కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంత ఆసక్తిగా ఎదురు చూశారో మనం చూసాం. ఇక ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ఈ సినిమా ఫ్రీ బుకింగ్స్ లోనే మనకు అర్థమయిపోయింది. అంతేకాదు ఈ సినిమాను పలు ఇండస్ట్రీలో నుంచి టాప్ స్టార్ హీరోలు ప్రమోట్ చేస్తూ ఆశక్తి కర కామెంట్స్ చేయడం సినిమాకు మరింత హైప్ తెచ్చింది.
కాగా భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఆయనను ఎలా చూడాలనుకున్నారో ఆ రేంజ్ ఎలివేషన్స్, అలాంటి లుక్స్ ఆ క్రేజ్ దక్కేలాగా డైరెక్టర్ నాగ అశ్విన్ అతని క్యారెక్టర్ అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇక కథలో హీరోయిన్‌లుగా నటించిన దీపికాను గ్లామర్ కు వాడకుండా కథలో భాగం చేసి కంటెంట్ తో స్టార్ బ్యూటీగా ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాడు. ఇక పవర్ ఫుల్ అశ్వద్ధామ(అమితాబ్).. భైరవా(ప్రభాస్)ల మధ్య జరిగే యాక్షన్స్ సన్నివేశాల్లో నాగ అశ్విన్ ప్రభాస్ అమితాబ్లను చూపించిన తీరు అద్భుతం అంటూ కామెంట్లు వినిపించాయి.
ఇద్దరినీ ఫైట్ సీన్స్‌లో ఓ రేంజ్ లో ఎలివేట్ చేశారంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు దిశపట్టని సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక కమలహాసన్ పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ ప్రతి నాయకుడు ఎంత పవర్ఫుల్ గా ఉండాలో.. ఎంత భయంకరంగా ఉండాలో.. ఈ సినిమాల్లో కమల్ హాసన్ పాత్రను ఆ రేంజ్ లో తీర్చిదిద్దాడట నాగ్ అశ్విన్. ఉత్తమ నిర్మాణమైన విలువలు, హాలీవుడ్ ను మించి పోయే లెవెల్‌లో గ్రేట్ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకుంటున్నాయి. అయితే సినిమా కథ ప్రఏక్షకులకు నచ్చినా బిజిఎం పరంగా మాత్రం అభిమానుల్లో మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది.
చాలావరకు ఆడియన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అసలు వర్కౌట్ కాలేదంటూ కామెంట్ల రూపంలో తెలియజేశారు. అలాగే ప్తభాస్ రోల్ సెకండ్ హాఫ్ నుంచి వేరే లెవెల్‌లో ఉన్న ఫస్ట్ మాఫ్ ప్తభాస్ రోల్ సిల్లీగా అనిపిస్తుందని.. బోరింగ్‌గా ఫిల్ అయ్యినట్లు పలుపురు కామెంట్లు చేశారు. మొత్తానికి ప్రభాస్ చివరగా నటించి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్న సలార్‌ను మించే బ్లాక్ బస్టర్ హిట్ కల్కితో ప్తభాస్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో రికార్డు క్రియేట్ చేస్తాయో చూడాలి.