ఎస్ ప్రెసెంట్ ఒక వీడియోని బాగా ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు . ఇప్పుడు తెలుగు రాష్ట్రాలల్లోనే కాదు టోటల్ ఇండియా వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే కల్కి ట్రెండ్ నడుస్తుంది . ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా గురించి జనాలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో మనకు తెలిసిందే. కాగా రీసెంట్గా కల్కి సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు .
విష్ణువు నుంచి అశ్వద్ధామ.. అర్జునుడు ..వంటి చాలా పాత్రలను కల్కి సినిమాలో చూపించారు . మరి ఆ పాత్రలేంటి? ఆ పాత్రలకు ఉన్న రిలేషన్షిప్ ఏంటి..? అనేది తెలుసుకోకుండా సినిమాకి వెళ్తే ఎలా..? అందుకోసమే నందమూరి ఫ్యాన్స్ ఒక వీడియోను ట్రెండ్ చేస్తున్నారు . గతంలో బాలయ్య ఒక తెలుగు ఈవెంట్లో మహాభారతంలోని పాత్రలు అన్నిటిని గురించి చెబుతూ ఒక స్కిట్ చేశాడు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎవరైతే ప్రభాస్ నటించిన కల్కి సినిమాను చూడడానికి వెళ్తున్నారో.. వాళ్ళు ఒక్కసారి వీడియో చూస్తే మీరు సినిమా చూసేటప్పుడు నాగ్ అశ్వీన్ రాసుకున్న క్యారెక్టర్జషన్స్ ని బాలయ్య డైలాగ్స్ ను వింటే మీ విజువలైజేషన్ ఇంకా బాగుంటుంది అని సినిమా బాగా అర్థమవుతుంది అని చెప్పుకొస్తున్నారు . కాగా కమల్ హాసన్ – అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో దిశాపటాని – శోభన – దీపికా పదుకొనే ఇంపార్టెంట్ రోల్స్ లో నటించిన కల్కి సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . అశ్వినీ దత్ 600 కోట్లకు పైగానే పెట్టిన ఈ సినిమా దాదాపు 1200 కోట్లకు పైగానే కలెక్ట్ చేస్తుంది అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..!!
Kalki movie ki velletappudu balayya cheppina mythology character names vinte oka clarity vasthadi…elephant memory 🙏🙏 #NBK #KALKI2898AD pic.twitter.com/owZVjbrFzh
— Venky (@kvL0708) June 22, 2024