కల్కి పబ్లిక్ రివ్యూ.. ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చు.. మొదటి 15 నిమిషాలు అస్సలు మిస్ కాకండి..!!

కల్కి.. కల్కి.. ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే పేరు మారుమోగిపోతుంది. పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులతో పాటు.. సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది కల్కి. ఇప్పటికే అమెరికాలో రెండో షోను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇండియాలో ఫస్ట్ షో కంప్లీట్ అయిన వెంటనే దానికి సంబంధించిన రివ్యూలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ రివ్యూలతో సినిమాపై మరింత హైప్ పెంచేస్తున్నారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అంటే నిన్న‌టి వ‌ర‌కు రాజమౌళి పేరు వినిపించింది. అంతకుమించి అదిరిపోయే హాలీవుడ్ రేంజ్ విజువల్స్, తెలివితేటలు, కంటెంట్ తో చాలా అద్భుతంగా సినిమాను రూపొందించార‌ని అభిమానుల నుంచి కామెంట్లు విన‌బడుతున్నాయి. కల్కి సినిమా చూసిన రెబల అభిమానులు ఈ సినిమాపై ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దట్ ఇస్ డార్లింగ్ అంటూ.. కాలర్ ఎగరేసుకునే రేంజ్ లో సినిమా ఉందంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కల్కి సినిమాను థియేటర్స్ లో కచ్చితంగా ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్ ఉన్న ఈ సినిమాలు కచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి.. కథ కాస్త సాగదీతగా ఉన్న ఇంటర్వెల్ సీన్స్ అదిరిపోయాయని రివ్యూలలో వివరించారు.


పది నిమిషాల‌కు ఒక కొత్త క్యారెక్టర్, సర్ప్రైజ్ లపై సర్ప్రైజ్లు, సెకండ్ హాఫ్ లో కదా మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుందని.. నాన్ కల్కి రికార్డ్స్ పక్క అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే మొదటి 15 నిమిషాలు అసలు మిస్ కావొద్దు అంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి 15 నిమిషాల్లో అశ్వద్ధామ, అర్జునుల మధ్య వ‌చ్చే ఫైట్ స‌న్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దాడట‌ నాగ అశ్విన్. అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటించగా అశ్వద్ధామ పాత్రలో అమితాబచ్చన్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మొదటి 15 నిమిషాల సీన్ సినిమాకి హైలైట్ గా ఉంటుందంటూ పలువురు కామెంట్ల రూపంలో తెలియజేశారు. అయితే కొంతమంది మాత్రం అర్జునుడి పాత్రకు అసలు విజయ్ దేవరకొండ సెట్ కాలేదంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.